Breaking News

ఎవరిని అడిగి తీసుకెళ్లావురా?.. లం.. కొడకా... మెట్టితో కొడతా.!

Published on Fri, 06/05/2026 - 10:43

అనంతపురం సెంట్రల్‌: అనంతపురం నగర వన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు బూతు పురాణం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తాను సీఐ అనే విషయం మరచిపోయి బూతులతో రెచ్చిపోయారు.  ఓ పశువుల వ్యాపారితో ఆయన అసభ్యకర సంభాషణ సోషల్‌ మీడియాలో విన్న నెటిజన్లు ‘ఇతను అసలు సీఐనా.. లేక  మరేమైనా’ అని విమర్శిస్తున్నారు. అసలేం జరిగిందంటే... జిల్లాలోనే అతి పెద్ద పశువుల సంత ప్రతి ఆదివారం అనంతపురం మార్కెట్‌యార్డులో జరుగుతుంది. ఇక్కడి నుంచి బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు పశువులను అక్రమంగా కబేళాలకు తరలిస్తున్నారు. ఇలా తరలించే వారు కొంత మంది ముఠాగా ఉన్నారు. ఆ వ్యక్తులు ఎవరన్నది పోలీసులకు తెలుసు. ప్రతి వారం ట్రక్కులు బయలుదేరిన వెంటనే ఆయా మార్గాల్లోని పోలీసు స్టేషన్‌లకు ముడుపులు వెళతాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తంతు కాస్త ఈ వారం రివర్స్‌ అయ్యింది.  

దళిత నాయకుడు రికార్డు చేయడంతో.. 
స్థానిక మార్కెట్‌యార్డు నుంచి సోమవారం రాత్రి రెండు ట్రక్కులు పశువులతో బయలుదేరాయి. మార్గమధ్యంలో ఓ దళిత సంఘం నాయకుడు ఆ వాహనాలను తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసే సమయంలో సదరు సీఐ వాహనం కూడా అక్కడే ఉంది. దీంతో ఏం జరిగిందో ఏమో కానీ.. ‘వాహనాలు వెళ్లడానికి వీల్లేదు. మార్కెట్‌యార్డుకు తరలించాల’ని సీఐ ఆదేశించారు. వాటికి బ్లూకోల్ట్‌ కానిస్టేబుల్‌ను కాపలాగా ఉంచాడు. అయితే సదరు పశువుల వ్యాపారి కానిస్టేబుల్‌ కళ్లుగప్పి వాహనాలను రాప్తాడు దాటించాడు. వెంటనే సదరు పశువుల వ్యాపారికి సీఐ ఫోన్‌ చేసి బూతులు లంకించుకున్నాడు. ‘ఎవరిని అడిగి వాహనాలు తీసుకెళ్లావు రా లం.. కొడకా... మెట్టితో కొడతా.. చెత్తనా కొడకా.. చిల్లర నా కొడకా.. వాహనాలు పట్టుకున్న విషయం ఎస్పీకి, డీఎస్పీకి కూడా చెప్పాను. వెంటనే వాహనాలు మార్కెట్‌యార్డుకు రాకపోతే నీ కాళ్లు విరగ్గొడతా’ అంటూ ఐదు నిమిషాలకు పైగా బూతులతో రెచ్చిపోయారు. 

పోలీసు సిబ్బందితోనూ అదే తీరు  
నేరం చేసిన వ్యక్తులతోనే కాదు.. పోలీసు స్టేషన్‌కు వచ్చే వారితోనూ.. తన కింద పనిచేసే పోలీసు సిబ్బందితో కూడా సీఐ వెంకటేశ్వర్లు అదే తీరులోనే మాట్లాడతారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందరి ముందూ అవమానకరంగా మాట్లాడుతుండడంతో గతంలో కొంతమంది ఈ స్టేషన్‌ మాకొద్దు బాబోయ్‌ అని ఇతర పోలీసుస్టేషన్‌లకు బదిలీపై వెళ్లిపోయారు. కొంతమంది విధిలేక భరిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌.. మర్యాదగా మాట్లాడుకుందాం అనే మాటలు ఈ సీఐకి పనికిరావనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. 

 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)