Breaking News

ఆడ బిడ్డను పెంచలేక... వేరేవారికి ఇచ్చేశారు!

Published on Thu, 01/29/2026 - 13:34

అనంతపురం మెడికల్‌: అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని లేబర్‌ వార్డులో ఓ బిడ్డ కన్పించకపోవడం తీవ్ర కలకలం రేపింది. ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తమై విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం..ఆ తర్వాత బిడ్డను కుటుంబీకులే తెలిసిన వారికి ఇచ్చినట్లు తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

 టూటౌన్‌ సీఐ శ్రీకాంత్‌ యాదవ్, ఆస్పత్రి ఆర్‌ఎంఓ డాక్టర్‌ హేమలత తెలిపిన వివరాల మేరకు..అనంతపురం రూరల్‌ పరిధిలోని బీజేపీ కొట్టాలకు చెందిన దంపతులకు ఇది వరకే ముగ్గురు సంతానం(ఇద్దరు ఆడ పిల్లలు, మగపిల్లాడు). నాల్గో కాన్పునకు ఆమె సర్వజనాస్పత్రిలో చేరింది. ఈ నెల 24న సాధారణ కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం శిశువుకు వ్యాక్సిన్లు వేయించారు. తర్వాత శిశువు అదృశ్యమైంది. దీంతో ఆస్పత్రి  సిబ్బంది విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 

ఆస్పత్రి ఆర్‌ఎంఓ డాక్టర్‌ హేమలత వెంటనే టూటౌన్‌ సీఐ శ్రీకాంత్‌ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన సిబ్బందితో వచ్చి కుటుంబ సభ్యులను తమదైన శైలిలో విచారించారు. అసలు విషయం వెలుగు చూసింది. ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉండడంతో నాల్గోబిడ్డ పోషణ భారమవుతుందని భావించి బీజేపీ కొట్టాల వద్ద నివాసముండే రహీమ్‌ దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఇచ్చేశామని తెలిపారు. దీంతో చిన్నారిని స్వా«దీనం చేసుకుని తిరిగి ఆస్పత్రిలో      చేరి్పంచారు. బిడ్డ సురక్షితంగా ఉందని సీఐ తెలిపారు.    

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)