Breaking News

విజయవాడ నుంచి ఢిల్లీకి ‘అమృత్‌ కలశ్‌’ ప్రత్యేక రైలు

Published on Sun, 10/29/2023 - 05:23

రైల్వేస్టేషన్‌(విజయవాడ పశ్చిమ): నా భూమి.. నా దేశం ప్రచారంలో భాగంగా శనివారం విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి అమృత్‌ కలశ్‌యాత్ర ప్రత్యేక రైలు బయలు దేరింది. పశ్చి­మ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్‌ రాయన భాగ్యక్ష్మి, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు, మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుడ్కర్, డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్‌ జెండా ఊపి రైలును సాగనంపారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పాటు నిర్వహిస్తున్న అజాది కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ‘నా భూ­మి.. నా దేశం’ పేరుతో అక్టోబర్‌ 30, 31 తేదీలలో దేశ రాజధాని ఢిల్లీలో ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రంలో­ని 26 జిల్లాల నుంచి 1,100 మంది వలంటీర్లు 824 కలశాలతో రైలులో బయలు దేరా­రు. ఈ సందర్భంగా 750 మంది విద్యార్థు­లు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 1.5. కి.మీ. పొడ­వు జాతీ­­య జెండాతో భారత్‌ మాతాకు జై.. అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. 

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)