Breaking News

గ్రేట్‌ ఇండియన్‌ బ్రాండ్‌ అరకు కాఫీ..

Published on Mon, 07/17/2023 - 07:47

సాక్షి, అమరావతి: అరకు కాఫీ ఘుమఘుమలు మరోసారి అంతర్జాతీయంగా ఖ్యాతికెక్కింది. ప్రపం­చం­లోనే తొలి గిరిజన సంప్రదాయ కాఫీ అయిన అరకు కాఫీ ఇండియన్‌ గ్రేట్‌ బ్రాండ్లలో ఒకటి అంటూ నీతి ఆయోగ్‌ మాజీ సీఈవో అమితాబ్‌ కాంత్‌ ట్వీట్‌  చేయగా.. దానిని స్వాగతిస్తూ మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా రీట్వీట్‌ చేశారు. 

దీంతో, మరోసారి అంతర్జాతీయంగా అరకు కాఫీపై ట్విట్టర్‌ వేదికగా పెద్ద చర్చ జరుగుతోంది. ఇండియాలో జరుగు­తున్న జీ–20 సమావేశాల్లో విదేశీ ప్రతినిధులకు అందంగా ప్యాక్‌ చేసిన అరకు కాఫీని అందిస్తున్నామని, ఇది ప్రపంచంలోనే తొలి గిరిజన కాఫీగా గుర్తింపు పొందిందంటూ అమితాబ్‌ కాంత్‌ కీర్తించారు. సేంద్రియ విధానంలో సాగు చేస్తున్న కాఫీ సాగు ప్రాంతంగా అరకుకు గుర్తింపు లభించందన్నారు. ప్రతిసారి సేంద్రియ సాగు పరీక్షలో స్థిరంగా 90 కంటే ఎక్కువ మార్కులు సాధిస్తూ తొలి ఇండియన్‌ కాఫీగా నిలవడమే కాకుండా.. గ్రేట్‌ ఇండియన్‌ బ్రాండ్‌గా ఎదిగిందన్నారు. ఈ ట్వీట్‌పై ఆనంద్‌ మహీంద్రా స్పందిస్తూ.. దేశ విజయాన్ని అద్దంపట్టే విధంగా అరకు కాఫీని ఎంచుకోవడం అద్భుతమైన నిర్ణయమంటూ పొగిడారు.  

ఇది కూడా చదవండి: కొల్లేరు పర్యాటకం.. కొత్త అందాల నిలయం

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)