Breaking News

బెండపూడి జెడ్పీ హైస్కూల్‌: మీ ఆంగ్లం అద్భుతం: యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌

Published on Sun, 08/21/2022 - 04:46

తొండంగి: కాకినాడ జిల్లా బెండపూడి జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థులు ఆంగ్ల భాషలో కనబరుస్తున్న ప్రతిభను గుర్తించిన అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ డోనాల్డ్‌ హెప్లిన్‌ వారితో శుక్రవారం వెబ్‌ ఎక్స్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ముచ్చటించారు. అమెరికా యాసలో విద్యార్థులు ఇంగ్లిష్‌ మాట్లాడడంపై ఆయన అభినందనలు తెలిపారు. బెండపూడి జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థులు అమెరికా యాసలో ఇంగ్లిష్‌ను అనర్గళంగా మాట్లాడడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా విద్యార్థులను పిలిపించుకుని ముచ్చటించారు.

ఇది కాస్తా జాతీయ మీడియాలో ప్రసారం కావడంతో అమెరికన్‌ కాన్సులేట్‌ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో బెండపూడి జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థులతో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అమెరికన్‌ కాన్సులేట్‌ అధికారులు కోరారు. ఈ మేరకు విద్యాశాఖ ఆధ్వర్యంలో వెబ్‌ ఎక్స్‌ ద్వారా విద్యార్థులతో యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ డోనాల్డ్‌ హెప్లిన్‌ మాట్లాడేందుకు బెండపూడి హైస్కూల్‌లో ఏర్పాట్లు చేశారు.

డోనాల్డ్‌ హెప్లిన్‌తో విద్యార్థులు మేఘన, రీష్మ, తేజస్విని, వెంకన్నబాబు మాట్లాడారు. సుమారు 20 నిమిషాలు విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఆయన ముచ్చటించారు. ఎంత మందికి అమెరికాలో చదువుకోవాలని ఆసక్తి ఉందని ప్రశ్నించారు. విద్యార్థులంతా అమెరికాలో చదువుకునేందుకు ఆసక్తిగా ఉన్నామని బదులిచ్చారు. ఆంధ్రప్రదేశ్, అమెరికా సత్సంబంధాల అభివృద్ధికి ఆంగ్లభాష వారధిగా నిలుస్తుందని  హెప్లిన్‌ పేర్కొన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు ప్రసాద్‌ను కూడా హెప్లిన్‌ ప్రత్యేకంగా అభినందించారు. 

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)