Breaking News

Amaravati: మీటరు రోడ్డుకు రూ.10 లక్షలు!

Published on Thu, 09/18/2025 - 06:43

సాక్షి, అమరావతి: రాజధానిలో రోడ్ల నిర్మాణ ప­నుల అంచనాల్లో ఏడీసీఎల్‌ (అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) తన రికార్డులను తానే బద్ధలుకొడుతోంది. ఈ–13 రహదారిని 6 వరుస (లేన్‌)లతో ఎన్‌హెచ్‌–16 వరకూ పొడిగించే పనులను కి.మీకు రూ.66.18 కోట్ల చొప్పున కాంట్రాక్టరుకు అప్పగించిన ఏడీసీఎల్, తాజాగా.. సీడ్‌ యాక్స్‌స్‌ రోడ్డును మూడో దశలో 6 వరుసల­తో 755 మీటర్ల పొడవు (ఇందులో కృష్ణా వెస్ట్రన్‌ డెల్టా కాలువపై 130 మీటర్ల పొడవుతో నిర్మించే స్టీలు బ్రిడ్జితో కలిపి)తో నిర్మించి, పాత మంగళగిరి హైవేతో కలిపే పనులకు రూ.61.67 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. 

జీఎస్టీ, సీనరేజీ, న్యాక్‌ వంటి పన్నుల రూపంలో రూ.13.15 కోట్లు రీయింబర్స్‌ చేస్తా­మని పేర్కొంది. అంటే.. 755 మీటర్ల రోడ్డు కాంట్రాక్టు విలువ రూ.74.82 కోట్లన్న మాట. అంటే.. మీటరు రోడ్డు నిర్మాణానికి రూ.10 లక్షలు వ్య­యం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. దీనిపై ఇంజినీరింగ్‌ నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఆ రోడ్డును మట్టి, రాళ్లు, తారుతో నిరి్మస్తున్నారా లేక బంగారం పూతతో వేస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నా­రు. జాతీయ రహదారులను మీటరు రూ.2 లక్షల నుంచి రూ.2.2 లక్షలతోనే ఎన్‌హెచ్‌ఏఐ (నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా) నిరి్మస్తోందని ఇంజినీరింగ్‌ నిపుణులు గుర్తుచేస్తున్నారు. ముడుపుల కోసమే రోడ్డు పనుల అంచనా­లను పెంచేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పనుల పూర్తికి 4 నెలలు గడువు.. 
రాజధానిలో ప్రధాన ప్రాంతానికి (సీడ్‌ కేపిటల్‌) కోల్‌కత–చెన్నై జాతీయ రహదారిని అనుసంధానించేందుకు సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు (ఈ3)ను ఏడీసీఎల్‌ నిరి్మస్తోంది. అందులో భాగంగా ఈ రో­డ్డును పాత మంగళగిరి హైవేతో అనుసంధానం చేసే పనులను మూడో దశలో టెండరు పిలిచింది. మూడో దశలో 755 మీటర్ల పొడవున 6 వరుసల (స్ట్రీట్‌లైట్లు, ఫుట్‌పాత్, యుటిలిటీ డక్ట్‌లు, వరద నీటి వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలు)తో నిర్మించే పనులకు టెండర్లు పిలిచింది. ఇందులో.. 

కృష్ణా డెల్టా పశ్చిమ కాలువపై 130 మీటర్ల పొడవున స్టీలుబ్రిడ్జిని నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ పనుల పూర్తికి 4 నెలలు గడువుగా నిర్దేశించి ఈనెల 3న టెండరు నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ టెండరులో బిడ్‌ దాఖలు గడువు గురువారం సా.5 గంటలతో ముగియనుంది. ఆర్థిక బిడ్‌ శుక్రవారం తెరిచి.. తక్కువ ధరకు కోట్‌చేసిన కాంట్రాక్టు సంస్థను ఎల్‌–1గా తేల్చి.. ఆ సంస్థకే పనులు అప్పగించాలని సీఆర్‌డీఏకి ఏడీసీఎల్‌ సీఈ ప్రతిపాదన పంపనున్నారు.   

 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)