Breaking News

ప్రపంచ బ్యాంక్‌ వద్దన్నది.. అయినా అమరావతే రాజధాని

Published on Tue, 09/17/2024 - 03:34

అమరావతి ప్రాంతం రాజధానికి పనికిరాదని, ఇక్కడ నిర్మాణాలు చేపట్టొద్దని ప్రపంచ బ్యాంకు చెప్పింది. అయినా ఇక్కడే రాజధాని నిరి్మస్తాం. నవంబర్‌లో పనులు ప్రారంభిస్తాం. ఇక్కడ ముంపు భయం లేకుండా వచ్చే వర్షాకాలానికల్లా వాగులు, కాలువలను విస్తరిస్తాం. నెదర్లాండ్స్‌ టెక్నాలజీ వినియోగించి అమరావతిలోని వాగులు, కాలువలపై రిజర్వాయర్లు నిరి్మస్తాం. – రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ

సాక్షి, అమరావతి/తాడికొండ: అమరావతి ప్రాంతం రాజ­ధా­నికి పనికిరాదని, ఇక్కడ నిర్మాణాలు చేపట్టొద్దని ప్రపంచ బ్యాంకు చెప్పిందని, అయినప్పటికీ ఇక్కడే రాజధాని నిర్మిస్తామని, నవంబర్‌లో పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారా­యణ తెలిపారు. గతంలో అమరావతి ప్రాంతాన్ని పరి­శీలించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, నిపుణులు ఈ ప్రాంతం రాజధాని నిర్మాణానికి పనికిరాదని నివేదిక ఇచ్చి­నట్టు మంత్రి గుర్తు చేశారు. ఇటీవలి వరదల్లో దాదాపు 11.43 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా 2,017 చద­రపు కిలోమీటర్ల అమరావతి ప్రాంతానికి ఏమీ కాలేదని చెప్పారు. 

మంత్రి సోమవారం విజయవాడలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావే­శంలో, గుంటూరు జిల్లా తాడికొండలో మంత్రి మాట్లా­డుతూ.. గత ప్రభుత్వం మూడు ముక్కలాటతో అమరా­వతిని నాశనం చేసిందన్నారు. 2014–19 మధ్య 30 వేల మంది అమరావతిలో పనిచేశారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. కృష్ణానది, బుడమేరు వరదలు విజయవా­డ­లోని 32 డివిజన్లు, కొన్ని గ్రామాలను ముంచేసినా అమ­రావతికి ఏమీ కాలేదని చెప్పారు. గత ప్రభుత్వం అమ­రా­వ­తి మునిగిపోతుందని ప్రచారం చేసిందని, కానీ కృష్ణా నది వల్ల రాజధానికి ఎలాంటి ఇబ్బందీ లేదని అన్నారు. ఇక్కడ ముంపు భయం లేకుండా వచ్చే వర్షా కాలానికల్లా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్‌ను విస్తరిస్తామని తెలిపారు. అమరావతి సేఫ్‌ జోన్‌లో ఉందని, రాజధాని డిజైన్‌ సమయంలోనే వరద సమస్య లేకుండా కాల్వలు, రిజర్వాయర్లకు ప్రతిపాదనలు చేశామని అన్నారు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)