Breaking News

ఇంధన శాఖపై ‘కూటమి’ కన్ను!

Published on Thu, 07/04/2024 - 05:27

సాక్షి, అమరావతి: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆదుకోవడంతో అప్పులు తీర్చుకుని ఆదాయం బాట పట్టిన ఇంధన శాఖపై టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల కన్ను పడింది. డిస్కంలతో పాటు ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కోలో కీలక స్థానాల్లో తమ వారిని నియమించుకొని, కోట్లాది రూపాయలు దండుకొనేందుకు కూటమికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు పెద్ద కుతంత్రానికే తెరలేపారు. ఇందులో భాగంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో నియమితులైనవారిని రాజీనామాలు చేసి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారు. 

గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రభుత్వ శాఖలను జేబులు నింపుకొనేందుకు వాడుకున్నారో ఇప్పుడూ అదే తీరులో చెలరేగుతున్నారు. వారి ధన దాహానికి డైరెక్టర్‌ నుంచి అన్ని స్థాయిల ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. కూటమి పెద్దల బలవంతంతో వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. కొందరిని బలవంతంగా బయటకు పంపిస్తున్నారు. ఇప్పటికే ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్‌ జేఎండీ, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి మల్లారెడ్డి చేత రాజీనామా చేయించారు. 

ఏపీ సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌లో ముఖ్య ఆర్థిక సలహాదారులు హనుమంతరావు, సింహాచలం, జెన్‌కో ఓఎస్‌డీ ఆంటోని రాజు, మరికొందరిని విధుల నుంచి తప్పించారు. డైరెక్టర్లనూ రాజీనామా చేయాలని ఇటీవల హుకుం జారీ చేశారు. మంగళవారం రాత్రి మరోసారి గట్టిగా చెప్పడంతో ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో, మూడు డిస్కంలలోని 10 మంది డైరెక్టర్లు బుధవారం రాజీనామా చేశారు. వారి బాధ్యతలను తాత్కాలికంగా సీజీఎంలకు అప్పగిస్తూ డిస్కంల సీఎండీలు ఉత్తర్వులు జారీ చేశారు. 

ఖాళీ అయిన పోస్టుల్లో కొన్నింటికి రూ. కోట్లలో బేరాలు మొదలు పెట్టినట్లు సమాచారం. కొన్ని పోస్టుల్లో అనుయాయులను నియమించుకొని వారి ద్వారా కోట్లు దండుకొనే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంల అధిపతులను కూడా మార్చాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి తమకు అనుకూలంగా ఉండే పలువురు ఐఏఎస్‌ అధికారుల పేర్లును పరిశీలిస్తున్నట్లు సమాచారం.

10 మంది డైరెక్టర్ల రాజీనామా 
ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ, జెన్‌కో ఎండీ, డిస్కంల సీఎండీలకు 10 మంది డైరెక్టర్లు బుధవారం రాజీనామా లేఖలను అందజేశారు. వాటిని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కు పంపగా, ఆయన వెంటనే ఆమోదించారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.  

రాజీనామా చేసిన డైరెక్టర్లు 
»  టి.వీరభద్రరెడ్డి (ఫైనాన్స్‌– ఏపీ ట్రాన్స్‌కో) 
»    డి.ఎస్‌.జి.ఎస్‌.ఎస్‌. బాబ్జి (థర్మల్‌ – ఏపీ జెన్‌కో) 
»   సయ్యద్‌ రఫి (హెచ్‌ఆర్, ఐఆర్‌ – ఏపీ జెన్‌కో) 
»   ఎంవీవీ సత్యనారాయణ (హైడల్‌ – ఏపీ జెన్‌కో) 
»    సి.శ్రీనివాసమూర్తి (ఆపరేషన్స్‌ – ఏపీఈపీడీసీఎల్‌) 
» ఎ.వి.వి.సూర్యప్రతాప్‌ (ప్రాజెక్ట్స్‌ – ఏపీఈపీడీసీఎల్‌) 
» వి. బ్రహా్మనందరెడ్డి (ఫైనాన్స్‌ – ఏపీసీపీడీసీఎల్‌) 
»   బి. జయభారతరావు (టెక్నికల్‌ – ఏపీసీపీడీసీఎల్‌) 
»   టి. వనజ (ప్రాజెక్ట్స్‌ – ఏపీసీపీడీసీఎల్‌) 
»   కె.శివప్రసాదరెడ్డి (ప్రాజెక్ట్స్‌ – ఏపీఎస్పీడీసీఎల్‌)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)