Breaking News

రుషికొండపై వ్యవహారాలన్నీ ఎంవోఈఎఫ్‌కు అప్పగిస్తాం

Published on Thu, 07/20/2023 - 04:36

సాక్షి, అమరావతి: రుషికొండపై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాల వ్యవహారాలన్నీ కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ (ఎంవోఈఎఫ్‌)కు అప్పగిస్తామని హైకోర్టు ప్రతిపాదించింది. ఈ కొండపై నిర్మాణాల నిమిత్తం చేసిన తవ్వకాలపై సర్వే చేసేందుకు హైకోర్టు ఆదేశాల మేరకు ఎంవోఈఎఫ్‌ ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో నిర్మాణాల్లో ఉల్లంఘనల వ్యవహారాన్ని కూడా ఆ శాఖే చూడటం సబబని తెలిపింది.

నిర్మాణాల్లో కొన్ని ఉల్లంఘనలు ఉన్నట్లు ఆ కమిటీ తేల్చిందని, అవి  చిన్నవేనా లేక తీవ్రమైనవా అన్న విషయాలను ఆ శాఖే తేలిస్తే బాగుంటుందని తెలిపింది. ఈ ప్రతిపాదనలపై స్పందన తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్‌ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

విశాఖలోని రుషికొండపై తవ్వకాలు, నిర్మాణాలపై జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై ఏసీజే ధర్మాసనం విచారణ జరిపింది. రుషికొండపై పనుల్లో ఉల్లంఘనలు ఉన్నట్లు ఎంవోఈఎఫ్‌ కమిటీ తేల్చినందున, నిర్మాణాలు కొనసాగించకుండా ఆదేశాలు జారీ చేయాలని మూర్తి యాదవ్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తి కోరారు.

దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంవోఈఎఫ్‌కు అప్పగిస్తామని ప్రతిపాదించింది. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్‌ తీవ్ర అభ్యంతరం తెలిపారు. పిటిషనర్ల అభ్యర్థన మేరకే ఎంవోఈఎఫ్‌ కమిటీని ఏర్పాటు చేసిందని, ఈ కమిటీ క్షేత్రస్థాయిలో సర్వే చేసి నిర్మాణాల్లో ఉల్లంఘనలు లేవని నివేదిక ఇచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

నివేదికను పరిశీలిస్తే పూర్తి వివరాలు అర్థమవుతాయన్నారు. ఈ వ్యవహారాన్ని ఎంవోఈఎఫ్‌కు పంపడం వల్ల జాప్యం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఒకవేళ ఎంవోఈఎఫ్‌కు పంపాలనుకుంటే పిటిషనర్లు వారి వ్యాజ్యాలను ఉపసంహరించుకోవాలన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)