Breaking News

లక్ష ఇంటర్న్‌షిప్స్‌!

Published on Sat, 10/25/2025 - 05:02

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా విద్యార్థులకు వృత్తిపరమైన శిక్షణ, అనుభవాన్ని అందించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి­(ఏఐసీ­టీఈ) ప్రత్యేక ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌–­2026­ను ప్రకటించింది. దాదాపు లక్ష మంది విద్యా­ర్థులకు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ఉచిత ఇంటర్న్‌­షిప్‌ అవకాశాన్ని కల్పిస్తోంది. 

ఇంజినీరింగ్‌తో­పాటు మేనేజ్‌మెంట్, ఆర్ట్స్, వాణిజ్యం, డిప్లొమా విద్యార్థులకు బోధన కాలంలోనే ఆచర­ణాత్మక వృత్తినైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా ఈ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను ఏఐసీటీఈ ప్రవేశ­పెట్టింది. తద్వారా అభ్యాసం, పరిశ్రమలకు మధ్య అంతరాన్ని తగ్గించాలని నిర్ణయించింది. ముఖ్యంగా విద్యార్థులను రెడీ టూ వర్క్‌కు సిద్ధం చేస్తోంది.

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విధానంలో..
లక్ష మందికి పైగా ఉచితంగా అందించే ఇంటర్న్‌­షిప్‌లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విధానంలోఏఐసీటీఈ అందిస్తోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, సైబర్‌ సెక్యూరిటీ–ఎథికల్‌ హ్యాకింగ్, ఎలక్ట్రిక్‌ వెహికల్స్, స్పేస్‌ టెక్నాలజీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌–డేవ్‌ ఆప్స్, ప్రభుత్వంలోని నీతి ఆయోగ్, భారత ప్రభుత్వ విధా­­నాలు, ఎంఎస్‌ఎంఈ కార్యక్రమాలు, మహిళా సాధికారత, స్మార్ట్‌ విలేజ్, ఏఐసీటీఈ గ్రామీణ ఆవి­­ష్కరణ మిషన్ల కార్యక్రమాలు వంటి ప్రభుత్వ, నూతన సాంకేతిక అంశాల్లో వృత్తిపరమైన నైపుణ్య శిక్షణ కల్పిస్తుంది. 

తద్వారా విద్యార్థికి భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు బాటలు వేస్తోంది. ఈ ఇంటర్న్‌షిప్‌లో డిప్లొమా, యూజీ, పీజీ­లలో ఏ విభాగానికి చెందిన విద్యార్థులైనా ఉచితంగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ (జీn్ట్ఛటnటజిజీp.్చజీఛ్ట్ఛిజీnఛీజ్చీ.ౌటజ) చేసుకునే వెసు­లు­­బాటు కల్పించింది. ఐబీఎం, సిస్కో, మైక్రో­సాఫ్ట్, నాస్కాం, ఇస్రో, డీఆర్‌డీవో, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్య సంస్థలో భారీ ఇంటర్న్‌షిప్‌ ప్రాజెక్టును నిర్వహిస్తోంది.

ఇంటర్న్‌షిప్‌ కాలవ్యవధి 4 నుంచి 12 వారాలు కాగా, కొన్ని సంస్థలు రూ.5వేల నుంచి రూ.15వేల వరకు స్టయిఫండ్‌ ఇస్తాయి. ఇంటర్న్‌షిప్‌ ముగిసిన తర్వాత ఏఐసీటీఈ పోర్టల్‌ ద్వారా డిజిటల్‌ సర్టిఫికెట్‌ అందిస్తారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ఎంపికల్లో తొలి ప్రాధాన్యం దక్కుతుంది. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)