Breaking News

రైతుసేవా కేంద్రాల కుదింపు నిజమే

Published on Sat, 02/15/2025 - 04:35

సాక్షి, అమరావతి: రైతు సేవా కేంద్రాలను (ఆర్‌ఎస్‌కే) సాగు విస్తీర్ణం ప్రాతిపదికన కుదించేందుకు కసరత్తు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ‘ఆర్బీకేలు అదృశ్యం..!’ శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్‌ఎస్‌కేల (పూర్వపు రైతుభరోసా కేంద్రాలు–ఆర్బీకే) హేతుబద్ధీకరణ ప్రక్రియను గ్రామ, వార్డు సచివాలయాల విభాగం పర్యవేక్షిస్తుందని ప్రకటించింది. 

గతంలో జనాభా ప్రాతిపదికన ఏర్పాటు.. 
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో జనాభా ప్రాతిపదికన ప్రతీ రెండువేల మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఏర్పాటుచేశారని, వీటికి అనుబంధంగా గ్రామస్థాయిలో మొత్తం 10,778 రైతు సేవా కేంద్రాలను ఏర్పాటుచేశారని వ్యవసాయ శాఖ పేర్కొంది. 

ఆ సమయంలో సాగు విస్తీర్ణాన్ని పరిగణలోకి తీసుకోలేదని, ఈ కారణంగా కొన్ని ఆర్‌ఎస్‌కేలు 100–2,500 ఎకరాల పరిధితో ఏర్పాటయ్యాయని తెలిపింది. వీటి ద్వారా రైతులకు కావాల్సిన సాగు ఉత్పాదకాలతో పాటు రైతుసేవలన్నీ అందించేవారని.. కానీ, ప్రస్తుతం సాగు విస్తీర్ణం ప్రాతిపదికన హేతుబద్ధీకరణ (కుదింపు) చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయ శాఖ పేర్కొంది.  

సాగు ఉత్పాదకాల పంపిణీ నిలిపివేత నిజమే
2020 మే 30 నుంచి గత ప్రభుత్వ పాలనలో రైతులకు కావలసిన ఎరువులు, సబ్సిడీ నాన్‌ సబ్సిడీ విత్తనాలు, పురుగు మందులు, ఆక్వాఫీడ్, సీడ్, సంపూర్ణ దాణా వంటి సాగు ఉత్పాదకాలన్నీ ఆర్‌ఎస్‌కేల ద్వారానే పంపిణీ జరిగేవని వ్యవసాయ శాఖ ఆ ప్రకటనలో వివరించింది. 

ప్రస్తుతం వాటిల్లో పనిచేస్తున్న సిబ్బందిని పూర్తిగా రైతులకు విస్తరణ సేవలు, సాంకేతిక సూచనలు, సలహాలందించేందుకు ఉపయోగిస్తున్నామని.. ఈ కారణంగానే ఆర్‌ఎస్‌కేల ద్వారా సాగు ఉత్పాదకాల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిందని పేర్కొంది. వీటిని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్‌) ద్వారా చేయాలని, తద్వారా వాటిని బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)