Breaking News

రఘురామ అమాయకుడేమీ కాదు..

Published on Fri, 02/16/2024 - 05:16

సాక్షి, అమరావతి : సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ నర్సా­పురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేయడం వెనుక దురుద్దేశా­లున్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ హైకోర్టుకు నివేదించారు. ఆయన తన వ్యక్తిగత కక్షతోనే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని తెలిపారు. అంతేకాక.. తన గురించి అనేక వాస్తవాలను తొక్కిపెట్టి ఆయన ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రఘురామ దాఖలు చేసిన వ్యాజ్యం రిట్, పిల్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నారు.

తనపై కేసుల గురించి కనీస స్థా­యి­­లో కూడా ఆయన ప్ర­సా­్త­వించలేదన్నారు. లోక్‌స­భ ­స్పీకర్‌కు వైఎస్సార్‌సీపీ ఇచ్చిన ఫిర్యాదు గురించి, జాతీయ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ముందున్న కోర్టు ధిక్కార ప్రోసీడింగ్స్‌ను కూడా తన వ్యాజ్యంలో పేర్కొనలేద­న్నారు. పైపెచ్చు తనపై ఎలాంటి సివిల్, క్రిమినల్‌ కేసులు లేవంటూ డిక్లరేషన్‌ కూడా ఇచ్చారని ఏజీ  శ్రీరామ్‌ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అసలు రఘురామ చట్ట నిబంధనల గురించి తెలియని అమాయకుడేమీ కాదన్నారు. కోర్టుల్లో ఏం జరుగుతుందో ఆయన బాగా తెలుసన్నారు.

అలాగే, కోర్టుల్లో జరిగే కేసుల విచారణలపై వ్యాఖ్యలు చేయడం కూడా ఆయనకు తెలుసునని తెలిపారు. పైగా ఆయన పార్లమెంట్‌ సభ్యుడని, అలాంటి వ్యక్తికి చట్ట నిబంధనల గురించి తెలియకపోవడానికి ఏముంటుందని శ్రీరామ్‌ చెప్పారు. అన్నీ తెలిసే ఆయన ఉద్దేశపూర్వకంగా తనకు సంబంధించిన కీలక విషయాలను పిటిషన్‌లో బహిర్గతం చేయకుండా తొక్కిపెట్టారని కోర్టుకు వివరించారు. ముఖ్యమంత్రి, ఇతర ప్రభుత్వ పెద్దలపై విషం చిమ్ముతూ తప్పుడు ప్రచారం చేయడాన్నే రఘురామకృష్ణరాజు పనిగా పెట్టుకు­న్నా­రన్నారు.

కోర్టులు ఒకవైపు కేసులను విచారిస్తుంటే మరోపక్క ఆయన మీడియా ముందు ఆ కేసుల గురించి మాట్లాడటమే కాక, వ్యక్తులపై విషం చిమ్ముతూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడు­తుంటారని ఏజీ వివరించారు. ఆయన పలు మీడియా ఛానెళ్లతో ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం, ఇతర ప్రభుత్వ పెద్దల గురించి మాట్లాడిన మాటల తాలూకు వీడియోలను పరిశీలించాలని ఆయన కోర్టును కోరారు. ఆ వీడియాలను తమ కౌంటర్‌తోపాటు జతచేశామని తెలిపారు.

వాటిల్లో మాట్లాడిన మాటలను యథాతథంగా కౌంటర్‌లో పొందుపరిచామన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ.. ఈ వీడియోలను తాము ఇంటి వద్ద చూస్తామని, కౌంటర్‌లో రాసిన అంశాలను చూస్తామని తెలిపింది. తదుపరి విచారణను మార్చి 4కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూ­ర్తులు జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ మండవ కిరణ్మయి ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.

సంక్షేమ పథకాల నిర్ణయాలపై పిల్‌..
రాష్ట్ర ప్రజల సంక్షేమ కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభు­త్వం అమలుచేస్తున్న పలు ప్రజా సంక్షేమ పథకాలకు దురుద్దేశాలను ఆపాదించడంతోపాటు వాటివల్ల పలు­వురికి లబ్ధిచేకూర్చేలా ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు­న్నాయని, వాటిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ రఘురామ పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీని విచారణార్హతపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం లేవ­నెత్తింది. దీంతో ధర్మాసనం కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులందరినీ ఆదేశించింది.

ఈ ఆదేశాల మేరకు ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేశారు. తాజాగా.. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ దుర్గాప్రసాదరావు నేతృత్వంలోని ధర్మా­సనం గురువారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు విని­పించారు. రఘురామ దురుద్దేశంతోనే పిల్‌ దాఖలు చేశారని, ఇలాంటి వ్యాజ్యానికి విచారణార్హతే లేదన్నారు.

అడ్వొకేట్‌ జనరల్‌గా తాను కోర్టులకు సహకరిస్తుంటానని, తాను మొదట కోర్టు ఆఫీసర్‌నని, తనపై కూడా ఆయన నిందారోపణలు చేశారని తెలిపారు. ఆ వీడియోలనూ పరిశీలించాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది.

విచారణార్హతపై వాదనలకే పరిమితం కావాలి
అంతకుముందు.. రఘురామ తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు నాయకులంటే ఎలా ఉండాలో వివరించడం మొదలుపెట్టారు. ధర్మాసనం ఆయన్ను వారిస్తూ, కేసు గురించి వాదనలు చెప్పాలని స్పష్టంచేసింది. దీంతో సీఎం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అందుకే తాము ఈ పిల్‌ దాఖలు చేశామన్నారు. ఈ వ్యాజ్యం దాఖలు వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవన్నారు.  

Videos

TDP అరాచకం.. సాక్షి రిపోర్టర్ సెల్ లాక్కొని దాడి

రవి కార్తీక్ కు జగన్ అభినందనలు..

జనసేన నేతలను చితక్కొట్టిన టీడీపీ అంబటి సెటైర్లు అదుర్స్

చుట్టమల్లే... ఆగలేదా? జూ.ఎన్టీఆర్ పై మళ్లీ...

పడిపోతున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే?

నామినేషన్ వేయకుండా ఆపుతున్న పోలీసులు

చంద్రబాబు గుర్తుపెట్టుకో.. చీర లాగి.. ఇంత దారుణంగా కొడతారా..? జనసేన నేత వార్నింగ్

ప్రసాద్ బాబుకు ఒక న్యాయం.. ఇందిరకు మరో న్యాయమా?

విడుదల రజిని ఘటనపై ధ్రువ్ రాఠీ స్పందన

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. మైనింగ్ లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

Photos

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు