Breaking News

నిబంధనల మేరకే పత్రికలకు ప్రకటనలు

Published on Wed, 03/12/2025 - 05:03

సాక్షి, అమరావతి: వార్తా పత్రికలకు ప్రకటనల జారీ విషయంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై కూటమి నేతలు చేస్తున్న అసత్య ప్రచారంలో వీసమెత్తు వాస్తవం లేదని, నిబంధనల మేరకే ప్రకటనలు ఇచ్చి నట్లు అసెంబ్లీ సాక్షిగా మరోసారి తేటతెల్లమైంది. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా సాక్షి పత్రికకు  రూ.400 కోట్ల ప్రకటనలు ఇచ్చారని టీడీపీ నేతలు దు్రష్పచారం చేశారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఏడాది జూలైలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలే అడిగిన ప్రశ్నకు పౌర సంబంధాల శాఖ  మంత్రి కొలుసు పార్థసారథి ఇచ్చిన సమాధానంతో రుజువైంది. 

ఆ ఐదేళ్లలో సాక్షికి రూ.371 కోట్లు, ఈనాడు పత్రికకు మూడున్నరేళ్లపాటు అదే స్థాయిలో ప్రభుత్వం ప్రకటనలు జారీ చేసినట్టు వెల్లడించారు. మంగళవారం శాసన మండలిలో టీడీపీ సభ్యులే దీనిపై ప్రశి్నంచగా.. గత ప్రభుత్వంలో జీవో 431 ప్రకారం నిబంధనలకు లోబడే వార్తా పత్రికలకు ప్రకటనలను జారీ చేశారని ఒప్పుకొన్నారు. ఈ జీవో ప్రకారం ప్రకటనలు ఇచ్చే విచక్షణాధికారం సమాచార, పౌర సంబంధాల (ఐ అండ్‌ పీఆర్‌) శాఖ డైరెక్టర్‌కు ఉంటుందన్నారు. 

ఈ మేరకే 2019 – 24 మధ్య సాక్షికి రూ.371 కోట్ల విలువైన ప్రకటనలు జారీ చేయగా, అందులో రూ. 196 కోట్లు చెల్లించారని తెలిపారు. ఈనాడు సహా ఇతర పత్రికలన్నింటికీ రూ.488 కోట్ల మేర ప్రకటనలు ఇవ్వగా.. అందులో రూ. 360 కోట్లు ప్రభుత్వం చెల్లించిందన్నారు. మంత్రి సమాధానం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ నిష్పాక్షికతను మరోసారి వెల్లడించింది. 2019కు ముందు ప్రభుత్వం జారీ చేసిన జీవో 431 ప్రకారమే 2019 – 24 మధ్య ప్రకటనలు ఇచ్చినట్లు మరోసారి స్పష్టమైంది. 

మూడన్నరేళ్లలోనే ఈనాడుకు రూ.243 కోట్ల విలువైన ప్రకటనలు 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తొలి మూడున్నరేళ్లలోనే ఈనాడు పత్రికకు సమాచార శాఖ ద్వారా రూ.190 కోట్లు, వివిధ శాఖల ద్వారా రూ.53 కోట్లు చొప్పున మొత్తం రూ.243 కోట్లు విలువైన ప్రకటనలను ఇచ్చారు. ఆ తర్వాత ఈనాడు యాజమాన్యం ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వొద్దని, తాము ప్రచురించబోమని అధికారికంగా సమాచార శాఖకు లేఖ రాసింది. దాంతో చివరి ఏడాదిన్నర ఈనాడు పత్రికకు ప్రకటనలు ఇవ్వలేదు. ఈ లెక్కన పరిశీలిస్తే సాక్షి పత్రికతో సమానంగా ఈనాడు పత్రికకు కూడా ప్రకటనలు ఇచ్చారనేది వాస్తవం. 

ఇక తాజాగా ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం సాక్షికి ఇచ్చిన ప్రకటనల మొత్తంలో రూ.175 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని స్పష్టమైంది. 2014–19 మధ్య చంద్రబాబు జమానాలో ప్రభుత్వ ప్రకటనల జారీలో ‘సాక్షి’ పత్రిక పట్ల వివక్షాపూరితంగా వ్యవహరించారు. ఆ ఐదేళ్లలో ఈనాడు పత్రికకు రూ.121.97 కోట్ల ప్రకటనలు ఇవ్వగా, సాక్షి పత్రికకు కేవలం రూ.30.97 కోట్ల మేరకే ప్రభుత్వ ప్రకటనలు జారీ చేశారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)