Breaking News

‘సాక్షి’పై చంద్రబాబు అక్కసు

Published on Fri, 09/20/2024 - 05:02

సాక్షి, అమరావతి:  కూటమి సర్కారు అరాచకాలు, వైఫల్యాలు, అవినీతిని ఎండగడుతున్నందుకే ‘సాక్షి’ పత్రికపై చంద్రబాబు మంత్రి మండలి సమావేశం మాటున అక్కసు వెళ్లగక్కారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ‘సాక్షి’కి ప్రభుత్వ ప్రకటనల జారీని వక్రీకరిస్తూ అసత్య ఆరోపణలు చేశారు. గతంలో శాసనసభ వేదికగా వక్రీకరణలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన చంద్రబాబు.. ఈసారి కూడా అవే అవాస్తవాలను వినిపించారు. 

నాడు నిబంధనల మేరకే అన్ని పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు జారీ చేశారని  సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి శాసనసభలో లిఖిత పూర్వకంగా సమాధానమివ్వడం గమనార్హం. అయినాసరే చంద్రబాబు పదే పదే సాక్షి పత్రికపై బురదజల్లేందుకు యత్నిస్తుండటం ఆయ­న దిగజారుడుకు నిదర్శనంగా నిలుస్తోంది.  

భారతి చైర్‌పర్సన్‌ కాదు.. డైరెక్టరూ కాదు
వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి చైర్‌పర్సన్‌గా ఉన్న సాక్షి పత్రికకు అక్రమంగా అధికంగా ప్రకటనలు ఇచ్చారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉంది. వాస్తవం ఏమిటంటే వైఎస్‌ భారతి సాక్షి పత్రికకు చైర్‌పర్సన్‌ కాదు.. డైరెక్టరూ కాదు.  

ఏబీసీ మార్గదర్శకాల మేరకే ప్రకటనలు 
వైఎస్సార్‌సీపీ హయాంలో సాక్షి పత్రికకు అడ్డగోలుగా రూ.443 కోట్ల ప్రకటనలు జారీ చేశారని చంద్రబాబు ఆరోపణలు చేశారు. ఇతర పత్రికలన్నింటికీ కలిపి కూడా అంత విలువైన ప్రకటనలు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. వాస్తవం ఏమిటంటే నాడు సమాచార శాఖ నిబంధనలు, ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్‌ (ఏబీసీ) గణాంకాలను పరిగణలోకి తీసుకునే సాక్షి, ఈనాడుతోపాటు ఇతర పత్రికలకు ప్రకటనలు ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ హయాంలో సాక్షి పత్రికకు ఐదేళ్లలో రూ.443 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు జారీ చేశారని చంద్రబాబు చెప్పింది అవాస్తవం. 

సాక్షి పత్రికకు ఆ ఐదేళ్లలో మొత్తం రూ.371 కోట్ల విలువైన ప్రకటనలు జారీ అయ్యాయి. ఈనాడు పత్రికకు కూడా మొత్తం రూ.243 కోట్లు విలువైన ప్రకటనలు ఇచ్చారు. అయితే మూడున్నరేళ్ల తరువాత తమకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వొద్దని  ఈనాడు యాజమాన్యం సమా­చార శాఖకు లేఖ రాసింది. దాంతో చివరి ఏడాదిన్నర ఈనాడు పత్రికకు ప్రకటలు ఇవ్వలేదు. 

ఆ ఏడాదిన్నర కూడా ఈనాడు పత్రిక యాజమాన్యం ప్రకటనలు తీసుకొని ఉంటే ప్రభుత్వం మరో రూ.125 కోట్ల వరకు విలువైన ప్రకటలు ఇచ్చేది. దాంతో సాక్షి పత్రికతో సమానంగా ఈనాడు పత్రికకు కూడా ప్రకటనల బడ్జెట్‌ కేటాయించినట్టు అయ్యేది. ఇక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈనాడు పత్రికకు ప్రకటనల బిల్లులు పూర్తిగా చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిందని చంద్రబాబు విమర్శించారు. 

వాస్తవమేమిటంటే.. ఈనాడుకే కాదు.. సాక్షి పత్రికకు కూడా ప్రకటనల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈనాడు పత్రికకు చెల్లించాల్సిన ప్రకటనల బకాయిలు రూ. 51 కోట్లు ఉండగా నాడు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ సాక్షి పత్రికకు రూ.104.85 కోట్ల యాడ్స్‌ బకాయిలు పెండింగులోనే ఉన్నాయి.  

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)