Breaking News

కాల్‌ మెర్జింగ్‌తో కాజేస్తారు!

Published on Fri, 02/21/2025 - 05:36

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో సైబర్‌ నేరగాళ్లు రోజుకో రూపంలో అమాయకులను మోసం చేసి డబ్బు కొల్లగొడుతున్నారు. తాజాగా కాల్‌ మెర్జింగ్‌ స్కాంకు తెరలేపారు. మనకు తెలియకుండానే మన నుంచి ఓటీపీలు తీసుకుని మన బ్యాంకు ఖాతా­ల­ను కాజేస్తున్నారు. ఈ తరహా మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొ­రే­షన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ)కు చెందిన ది యూ­నిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) హెచ్చ­రించింది. అపరిచితులు ఫోన్‌ చేసి అడిగితే ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీలను చెప్పవద్దని సూచించింది.

కాల్‌ మెర్జింగ్‌ స్కాం అంటే? 
ఒక అపరిచితుడు మీ ఫోన్‌ నంబర్‌ను మీ స్నేహితుడి నుంచి తీసుకున్నానని చెబుతూ కాల్‌ చేయడంతో ఈ స్కాం ప్రారంభమవుతుంది. మీతో ఫోన్‌ మాట్లాడుతూనే.. మీ స్నేహితుడు వేరే నంబర్‌ నుంచి కాల్‌ చేస్తున్నాడని చెప్పి, రెండు కాల్స్‌ను విలీనం (మెర్జ్‌) చేయమని స్కామర్‌ అడుగుతాడు. ఆ ‘స్నేహితుడి’కాల్‌ నిజంగా మీ మిత్రుడిది కాదు. అది బ్యాంకు ఓటీపీ కాల్‌. స్కామర్‌ అడగ్గానే మీరు కాల్‌ విలీనానికి అనుమతిస్తే సదరు వ్యక్తి వెంటనే బ్యాంకు ధ్రువీకరణకు సంబంధించిన ఓటీపీ కాల్‌తో కనెక్ట్‌ అవుతాడు. 

ఇలా బ్యాంకు కాల్‌ నుంచి వచ్చే ఓటీపీని అవతలి నుంచి వింటున్న సైబర్‌ మోసగాళ్లు సేకరిస్తారు. అప్పటికే బ్యాంకు వివరాలు తీసుకుని పెట్టుకునే సైబర్‌ మోసగాళ్లు..ఆ ఓటీపీని ఉపయోగించి మీ బ్యాంకు ఖాతాల్లోంచి డబ్బులు కొల్లగొడతారు. ఇదంతా కచ్చితమైన సమయంలోపు పూర్తిచేస్తారు. 
మీరు బ్యాంకు ఓటీపీ వారికి చెప్పినట్లు కూడా గుర్తించలేరు.

కాల్‌ మెర్జింగ్‌  స్కాంకు చిక్కకుండా ఉండాలంటే?
» అపరిచిత వ్యక్తులు మీకు ఫోన్‌ చేసి, మరో నంబర్‌ నుంచి వస్తున్న కాల్‌ను మెర్జ్‌ చేయాలని కోరితే అది కచ్చితంగా మోసమని గ్రహించాలి.
» మీకు అపరిచిత వ్యక్తులు ఫోన్‌ చేసి మేం బ్యాంకు నుంచి మాట్లాడుతు­న్నామని, లేదా మీకు స్నేహితుడికి స్నేహితుడిని అని చెప్తే నమ్మవద్దు.
» అనుమానాస్పద ఫోన్‌కాల్స్‌పై వెంటనే సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో టోల్‌ఫ్రీ నంబర్‌ 1930లో ఫిర్యాదు చేయాలి.
» మీరు ఓటీపీ పంచుకున్నట్టు అనుమానం వస్తే వెంటనే మీ బ్యాంకు అధికారులకు సమా­చారం ఇచ్చి డబ్బులు పోకుండా తగిన చర్యలు తీసుకోవాలి.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)