Breaking News

మానవ తప్పిదాల వల్లే ‘ఫార్మా’ల్లో ప్రమాదాలు

Published on Sat, 09/28/2024 - 05:34

సాక్షి, విశాఖపట్నం: చిన్నచిన్న మానవ తప్పిదాలవల్లే ఫార్మా కంపెనీల్లో పెద్దపెద్ద ప్రమాదాలు సంభవిస్తున్నాయని హైలెవల్‌ కమిటీ చైర్‌పర్సన్‌ వసుధా మిశ్రా స్పష్టంచేశారు. పరిశ్రమల్లో జరిగే ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై, అనుసరించాల్సిన విధానాలపై, ప్రమాదాల అనంతరం చేపట్టాల్సిన సహాయక చర్యలపై శుక్రవారం విశాఖలోని ఓ హోటల్‌లో జరిగిన ఉన్నతస్థాయి కమిటీ తొలిభేటీలో మేథోమథన చర్చ జరిగింది. 

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, పరవాడ పారిశ్రామికవాడలో ఇటీవల జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ఏర్పడిన కమిటీ తొలి సమావేశానికి అధ్యక్షత వహించిన చైర్‌పర్సన్, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి వసుధా మిశ్రా వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వెల్ల­­డించారు. ప్రభుత్వానికి అందించాల్సిన నివేదికలో పొందుపరచాల్సిన అంశాలపై, భవిష్యత్తు కార్యాచరణపై ఈ భేటీలో చర్చించారు. 

కార్మిక శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, పరి­శ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌. యువరాజ్, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లు ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్, విజయ్‌కృష్ణన్‌.. చెన్నై, తిరుపతి ఐఐ­టీల ప్రొఫెస ర్లు, ఇతర సభ్యులు సూచనలు ఇచ్చారు. అనంతరం మిశ్రా మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ‘ఎసైన్షియా’ వంటి ప్రమాదాలు జరగకుండా సాంకేతిక సహాయంతో ప్రపంచస్థాయి ఉత్తమ విధానాలను అవలంభించాల్సి ఉందన్నారు.  

ప్రమాదాలు జరగకుండా స్టాండర్డ్‌ ప్రోటోకాల్స్‌..
ఇక ఫార్మా పరిశ్రమల్లో ప్రమాదాలు పునరావృతం కాకుండా స్టాండర్డ్‌ ప్రోటోకాల్స్‌ పెట్టాలని సూచించినట్లు వసుధా మిశ్రా తెలిపారు.  వివిధ రాష్ట్రాల్లోనూ అధ్యయనం చేసి  ప్రభుత్వానికి నివేదిస్తామని వివరించారు. ఇటీవల జరిగిన ఎసైన్షియా ప్రమాదంలో పూర్తిగా మానవ తప్పిదం ఉందన్నది తమ పరిశీలనలో స్పష్టమైందన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)