Breaking News

బీపీసీఎల్‌కు తప్పిన ప్రమాదం

Published on Mon, 01/05/2026 - 05:33

ముత్తుకూరు (పొదలకూరు): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు సముద్ర తీర ప్రాంతంలోని బీపీసీఎల్‌ పెట్రోల్‌ రిఫైనరీ కంపెనీ సమీపంలో అగ్నికీలలు ఎగసి పడ్డాయి. ఆదివారం కావడంతో తీరానికి వచ్చిన పర్యాటకులు ఎవరో సమీపంలోని సవక తోటల్లో నిప్పు రాజేయడంతోనే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అదానీ కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ అధికారులు మంటలను సీసీటీవీ ఫుటేజీలో పరిశీలించి అప్రమత్తమయ్యారు. మెరైన్‌ పోలీసులకు సమాచారం అందించి, మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. పోర్టు పరిధిలోని తీర ప్రాంతంలో బీపీసీఎల్‌ పెట్రోల్‌ రిఫైనరీ, గ్యాస్‌ కంపెనీలు ఉన్నాయి.

వీటికి 200 మీటర్ల సమీపంలోనే మంటలు ఎగసిపడడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందారు. పర్యాటకులపై ఆంక్షలు లేకుండా పోయాయని తీరప్రాంత గ్రామస్తులు అంటున్నారు. దీనికితోడు సెక్యూరిటీ వైఫల్యం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకుల పేరుతో కొందరు ఆకతాయిలు వచ్చి సవక తోటల్లో పార్టీలు చేసుకుంటూ ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్‌ గ్యాస్‌ కంపెనీలు ఉన్న తీర ప్రాంతంలో నిరంతరం పర్యవేక్షణ ఉండాలంటున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)