Breaking News

తహసీల్దార్, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రూ.19.28 లక్షలు జప్తు

Published on Fri, 04/28/2023 - 04:16

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏడు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, రెండు తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఏసీబీ నిర్వహించిన సోదాల్లో రూ.19.28 లక్షల అనధికారిక నగదును స్వాదీనం చేసుకుంది. వరుసగా రెండో రోజు గురువారం కూడా ఏసీబీ అధికారులు ఆయా కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు.  పలు అక్రమాలకు సంబంధించిన పత్రాలు, ఇతర ఆధారాలను గుర్తించారు.  నగదుపై అధికారులు ఇ­చ్చి­న వివరణను విశ్లేషించాక సబ్‌ రిజిస్ట్రార్లు, ఇతరులపై పీసీ చట్టం కింద క్రిమినల్‌ కేసుల నమోదుతో పాటు,  తహసీల్దార్లపై శాఖా పరమైన చర్యలకు సిఫార్సు చేస్తామని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు.  

జప్తు చేసిన నగదు 
♦ గుంటూరు జిల్లా మేడికొండూరు తహసీల్దార్‌ కార్యాలయం నుంచి రూ.1.04 లక్షలు  
♦  జలుమూరు తహసీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్, సీనియర్‌ అసిస్టెంట్, రెవెన్యూ అధికారి నుంచి రూ.27,500.  
♦  బద్వేల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం విధులు నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు ఉద్యోగి వద్ద రూ.2.70 లక్షలు, డాక్యుమెంట్‌ రైటర్‌ నుంచి రూ.2.10 లక్షలు
♦  అనంతపురం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సబ్‌ రిజిస్ట్రార్‌ ప్రైవేట్‌ డ్రైవర్‌ ఎస్‌కే ఇస్మాయిల్‌ డాక్యుమెంట్‌ రైటర్ల నుంచి వసూలు చేసిన రూ.2 లక్షలకు పైగా నగదు
♦కందుకూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సబ్‌ రిజిస్ట్రార్‌ చాంబర్‌ నుంచి రూ.41 వేలు, డాక్యుమెంట్‌ రైటర్ల నుంచి రూ.94 వేలు జప్తు వన్నం సతీశ్‌ అనే డాక్యుమెంట్‌ రైటర్‌ ఆరు నెలల్లో సబ్‌ రిజిస్ట్రార్‌కు రూ.94 వేలు, సబ్‌ రిజిస్ట్రార్‌ అటెండర్‌కు రూ.1.20 లక్షలు ఫోన్‌ పే ద్వారా పంపినట్టు గుర్తించారు.
♦  తిరుపతి రూరల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో డాక్యుమెంట్‌ రైటర్‌ వద్ద రూ.90 వేలు, ఇద్దరు ప్రైవేటు ఉద్యోగుల వద్ద రూ.56 వేలు, జూనియర్‌ అసిస్టెంట్‌ వద్ద రూ.9 వేలు  
♦ నర్సాపురం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ సబ్‌ రిజిస్ట్రార్‌ చాంబర్‌ నుంచి రూ.30 వేలు, డాక్యుమెంట్‌ రైటర్ల వద్ద రూ.20 వేలు, సీనియర్‌ అసిస్టెంట్‌ వద్ద రూ.9,500, ప్రైవేటు ఉద్యోగి వద్ద రూ.6 వేలు.
♦ జగదాంబ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం( విశాఖపట్నం)లో ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓ ప్రైవేటు ఉద్యోగి మూడు విడతల్లో ఓ సబ్‌ రిజిస్ట్రార్‌కు రూ.90 వేలు పంపినట్టు గుర్తించారు. డాక్యుమెంట్‌ రైటర్ల నుంచి రూ.39 వేలు స్వాధీనం చేసుకున్నారు.
♦ తుని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో డాక్యుమెంట్‌ రైటర్ల నుంచి రూ.20 వేలు, లెక్కల్లోకి రాని మరో రూ.20 వేలు.   

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)