Breaking News

నలుగురు అధికారుల నివాసాల్లో ఏసీబీ సోదాలు 

Published on Sun, 11/19/2023 - 05:32

సాక్షి, అమరావతి/భవానీపురం(విజయవాడపశ్చిమ) : ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదులతో ఐదుగురు అధికారుల నివాసాల్లో ఏసీబీ అధికారులు శుక్ర, శనివారాలు తనిఖీలు నిర్వహించి భారీ ఎత్తున అక్రమ ఆస్తులను గుర్తించారు.
 
♦ కాకినాడ జిల్లా బెండపూడి ఆర్‌టీఏ చెక్‌పోస్ట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్స్‌పెక్టర్‌(ఎంవీఐ) పెసరమెల్లి రమేశ్‌బాబు నివాసంతో పాటు ఏపీ, తెలంగాణలోని ఆయన బంధువుల నివాసాల్లో తనిఖీలు చేశారు. హైదరాబాద్, మెద­క్, కంచికచర్ల, విజయవాడ, గుడివాడ, కనుమోలులలో కలిపి మొత్తం ఎకరా భూమి, మూడు ఫ్లాట్లు, 11 ఇంటి స్థలాలు, రెండు నివాస గృహాలు, రెండు వాణిజ్య దుకాణాలతో పాటు ఇన్నోవా కారు, రూ.8.94 లక్షల నగదు, రూ.33.83 లక్షల బంగారు ఆభరణా­­లు, ఇతర గృహోపకణాలను గుర్తించారు.  

♦నంద్యాల రవాణా కార్యాలయంలో పరిపాల­న అధికారి కుంపటి సువర్ణ కుమారి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆమె నివాసంతో పాటు హైదరాబాద్, కర్నూ­లు, నంద్యాల, బనగానపల్లి, మార్కాపురంలలోని బంధువుల ని­వా­­­సాల్లో తనిఖీలు చేస్తున్నారు. సువర్ణ కుమా­రికి కర్నూలు, కడపలలో ఇళ్లు, నంద్యాల, ఓర్వకల్, డోన్‌లలో ఇంటి స్థలంతో పా­టు పెద్ద ఎత్తున చరాస్తులున్నట్టు గుర్తించారు.  

♦ నంద్యాల గనుల శాఖ అసిస్టెంట్‌ జియాలజిస్ట్‌ గండికోట వెంకటేశ్వరరావుకు గుంటూ­రు, నంద్యాల తదితర ప్రాంతాల్లో ఉన్న నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. వెంకటేశ్వరరావు, ఆయన భార్య పేరిట గుంటూరు ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ను ఆనుకుని జి+3 నివాసం, గుంటూరు రూరల్‌ మండలం, తాడికొండ, పెదకాకాని మండలాల్లో వ్యవసా­య భూములు, గుంటూరు నగరం, గుంటూరు ఇన్నర్‌రింగ్‌రోడ్డును ఆనుకుని ఇళ్ల స్థలాలతో పాటు గుంటూరు నగరం, నరసరావుపేట, పెదకాకాని, గోరంట్లలో ఇళ్ల స్థలాలతో పాటు పెద్ద ఎత్తున చరాస్తులను గుర్తించారు.  

♦ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్‌ రిజిస్ట్రార్‌ లాలా బాలనాగధర్మసింగ్‌ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ధర్మసింగ్, ఆయన కుటుంబ సభ్యులపేరిట విజయవాడలోని గొల్లపూడి, బాపట్ల జిల్లా కొల్లూరులలో జి+1 నివాసాలతో పాటు విజయవాడలో ఇంటి స్థలం, 4 ఫ్లాట్లు, హైదరాబాద్‌లో రెండు ఫ్లాట్లు, ఇబ్రహీంపట్నంలో ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో దుకాణాలతో పాటు రూ.69 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రూ.10 లక్షల బ్యాంకు బ్యాలన్స్, రూ.18 లక్షల ఎల్‌ఐసీ పాలసీలు, పెద్ద ఎత్తున బంగారు, వెండి ఆభరణాలు, వాహనాలను గుర్తించారు. బినామీలపేరిట కూడా విజయవాడ, నల్లజర్లలో రెండు భవనాలు, మూడు ఇంటి స్థలాలు, వ్యవసాయ భూమి ఉన్నట్టు కూడా వెలుగు చూసింది. మరికొన్ని స్థిర, చరాస్తులు సింగ్‌ బంధువులు, స్నేహితుల పేరిట ఉన్నట్లు గుర్తించామని, తాము సోదాలకు వచ్చే సమయానికి సింగ్‌ పారిపోయారని ఏసీబీ అధికారులు చెప్పారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)