Breaking News

రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు చంద్రబాబు.. ఖైదీ నెంబర్‌ 7691 కేటాయింపు

Published on Sun, 09/10/2023 - 19:25

  • రాజమండ్రి  సెంట్రల్‌ జైలుకు చంద్రబాబు తరలింపు
  •  ప్రత్యేక భద్రత నడుమ చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలిస్తున్న పోలీసులు
  • చంద్రబాబుకు రాజమండ్రి జైలును కేటాయిస్తూ వారెంట్‌ జారీ

    ► రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్న చంద్రబాబు. చంద్రబాబుకు ఖైదీ  నెంబర్‌ 7691 కేటాయింపు.
    ►కొవ్వూరు టోల్గేట్ దటిన చంద్రబాబు కాన్వాయ్, ఫోర్త్ బ్రిడ్జి మీదుగా కొవ్వూరు నుండి దివాన్ చెరువుకు ప్రవేశించనున్న చంద్రబాబు కాన్వాయ్. హైవే మీదుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకోనున్న చంద్రబాబు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద 300 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లు సెంట్రల్ జైలు రోడ్డు బ్లాక్ చేసిన పోలీసులు.

►ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఆదివారం విజయవాడ ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలను పరిశిలించిన ఏసీబీ కోర్టు తీవ్ర ఉత్కంఠత నడుమ తీర్పును ప్రకటించింది. చివరకు చంద్రబాబుకు 14 రోజుల పాటు జ్యుడిషియల్  రిమాండ్ విధిస్తున్నట్లు  తీర్పునిచ్చింది.    

►స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడును ఆదివారం కోర్టులో హాజరుపరిచారు సిఐడి అధికారులు. విజయవాడ ఏసీబీ కోర్టులో ఉదయం నుండి దాదాపు ఏడున్నర గంటలకు పైగా వాదనలు జరిగాయి. వాదనలు ముగిశాక కోర్టు కాంపౌండులో కొంత హైడ్రామా నడిచిన తర్వాత ఏసీబీ జడ్జి సీఐడీ వాదనలతో ఏకీభవిస్తున్నటు తెలుపుతూ చంద్రబాబుకు 14 రోజులపాటు రిమాండ్ విధించింది.  

►సిఐడి అధికారులు సిద్ధం చేసిన రిమాండు రిపోర్టులో స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ప్రధాన సూత్రధారి చంద్రబాబేనని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధిగా ఉంటూనే చంద్రబాబు నేరానికి పాల్పడ్డారని, తాడేపల్లిలోని స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రంగా అక్రమాలు జరిగాయని రిమాండ్ రిపోర్టులో సీఐడీ అధికారులు పేర్కొన్నారు.

►మొత్తం రూ. 371 కోట్ల కుంభకోణమని అభియోగం మోపారు. దీనిలో సీమెన్స్ 90 శాతం ఖర్చు భరిస్తుందని క్యాబినెట్‌లో అబద్ధాలు చెప్పారని, నోట్ ఫైల్‌ను చంద్రబాబు, అచ్చెన్నాయుడు అప్రూవల్ చేశారని సీఐడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆర్థికశాఖ కార్యదర్శి అభ్యంతరం చెప్పినా కూడా వారు పట్టించుకోలేదని ఆనాడు సీఎం, సీఎస్ ఆదేశాలతోనే నిధులు విడుదలయ్యాయని, షెల్ కంపెనీల ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి రూ. 259 కోట్లు మళ్లించారని రిపోర్టులో స్పష్టం చేశారు. 

►ఆదివారం ఉదయాన్నే ఏసీబీ కోర్టులో వాదనలు జరిగగా చంద్రబాబు తరుఫున సిద్ధార్థ్ లూథ్రా, సీఐడీ తరుఫున అదనపు ఏజీ సుధాకర్ రెడ్డి న్యాయమూర్తికి వాదనలు వినిపించారు. సుదీర్ఘ వాదనలు విన్న ఏసీబీ జడ్జి సాయంత్రం తీర్పును వెలువరించింది. ఈ నెల 22 వరకు చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.

ఇది కూడా చదవండి: చంద్రబాబుకు జైలే

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)