Breaking News

అక్రమ ప్రాజెక్టులపై చేష్టలుడిగిన చంద్రబాబు

Published on Mon, 10/27/2025 - 05:34

కడప సెవెన్‌రోడ్స్‌: కృష్ణానదిపై కర్ణాటక, తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం చోద్యం చూడకుండా అడ్డుకోవాలని, లేకపోతే ముఖ్యంగా రాయలసీమ తీవ్రంగా నష్టపోవాల్సి వ­స్తుందని ఆలోచనాపరుల వేదిక నాయకుడు, విశ్రాంత ఐ­ఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు. ఆ­లోచనాపరుల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం కడపలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు.

కర్ణాటక అల్మట్టి డ్యాం ఎత్తు పెంచుతున్నా, తెలంగాణ ప్రభుత్వం జీవో 34 జారీచేసి అక్రమంగా 200 టీఎంసీల నీటిని తరలించుకుపోవడానికి డీపీఆర్‌ తయారు చేస్తున్నా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని ధ్వజమెత్తారు.› సీడబ్ల్యూసీ, కేంద్ర జలశక్తి శాఖకు కనీసం లేఖలు రాయని ముఖ్యమంత్రి చంద్రబాబు.. ‘మీ ప్రాజెక్టులు మీరు కట్టుకోండి, మా ప్రాజెక్టులు మేము కట్టుకుంటాం..’ అంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రానికి లేఖలు రాయడంతోపాటు తెలంగాణ జారీచేసిన జీవో నంబరు 34పై సుప్రీంకోర్టులో కేసు వేయాలని డిమాండ్‌ చేశారు.

పోలవరం–బనకచర్ల పథకం మరో కాలేశ్వరం ప్రాజెక్టు వంటిదని, ఇది కాంట్రాక్టర్లకు సిరులు కురిపించేందు­కేనని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే పె­ద్ద కదలిక వచ్చిందని కొనియాడారు. ఏపీ రైతు సేవాసమితి అధ్యక్షుడు అ­క్కి­నేని భవానిప్రసాద్, సెంటర్‌ ఫర్‌ లిబర్టీ అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి, జ­ల­వనరులు, సాగునీటి ప్రాజెక్టుల విశ్లేషకుడు టి.లక్ష్మీనారాయణ, కాంగ్రెస్‌ నా­యకుడు తులసిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో సైతం చర్చించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)