Breaking News

పేదలపై పిడుగు.. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్

Published on Thu, 08/15/2024 - 11:44

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడింది. బకాయిలు చెల్లించకపోవడంతో ఎమర్జెన్సీ సేవలు మినహా ఆరోగ్యశ్రీ సేవలను నెట్‌వర్క్ ఆసుపత్రులు నిలిపివేశాయి. ఆరోగ్యశ్రీ సీఈవో లక్ష్మీషాతో ఏపీ స్పెషాలిటీ హాస్పటల్ అసోసియేషన్ చర్చలు విఫలమయ్యాయి.

రాష్ట్ర వ్యాప్తంగా రూ.2500 కోట్ల బకాయిలకు 200 కోట్లు తక్షణమే చెల్లిస్తామన్న ఆరోగ్యశ్రీ సీఈవో లక్ష్మీషా.. మరో రూ.300 కోట్లు సోమవారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం బకాయిలు చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం మినహా గత్యంతరం లేదని అసోసియేషన్‌ తేల్చి చెప్పింది. చర్చలు విఫలం కావడంతో అత్యవసర సేవలు మినహా ఆరోగ్యశ్రీ  సేవలను ఆసుపత్రులు నిలిపివేశారు. రేపు(శుక్రవారం) స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్‌తో మంత్రి సత్యకుమార్‌ చర్చించనున్నారు.

రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. పథకం ఊసే లేకుండా చేయాలని సీఎం చంద్రబాబు నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో పథకం నిర్వహణకు డబ్బులు లేవు.. కేంద్రం అమలు చేసే ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్నే ప్రజలు వినియోగించుకోవాలంటూ టీడీపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఉచిత సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరోవైపు పథకం స్థానంలో బీమా ప్రవేశ పెట్టడానికి సిద్ధమైన బాబు సర్కార్‌.. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బకాయిల చెల్లింపులో జాప్యం చేస్తోంది. దీంతో ఆస్పత్రుల నిర్వహణ సాధ్యం కావడం లేదని, సిబ్బందికి జీతాల చెల్లింపు, మందులు, కన్జుమబుల్స్‌ కొనుగోలుకు కూడా డబ్బులు లేవని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు చేతులెత్తేశాయి. 
 

 

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)