Breaking News

పుట్టిన రోజుకు కొత్త బట్టలు తెచ్చా లే నాన్నా!

Published on Thu, 08/29/2024 - 12:28

ఉరవకొండ: ‘ఆజీం లే నాన్నా.. ఈ రోజు నీ పుట్టిన రోజు.. కొత్త బట్టలు తెచ్చాం. నీ స్నేహితులు, టీచర్లకు చాక్లెట్లు పంచిపెట్టాలి’ అంటూ ఆ తల్లిదండ్రులు విలపించిన తీరు అందరి కంట కన్నీళ్లు తెప్పించింది. పుట్టిన దినం రోజే ఓ బాలుడు మృతి   చెందిన విషాద ఘటన ఉరవకొండ పట్టణంలో జరిగింది. వివరాలు.. స్థానిక పాత మార్కెట్‌ సమీపంలో చాపదేవుని గుడి వద్ద నివాసముంటున్న అయ్యర్‌ బాబా ఫకృద్దీన్‌ ఉరవకొండ పోలీసు స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు. 

ఈయనకు భార్య హుమేరా ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఆజీంబాషా (14) సంతానం. బాలుడు ఉరవకొండ పట్టణంలోని ఓ ప్రయివేట్‌ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం తీవ్ర జ్వరం బారిన పడ్డాడు. దీంతో తల్లిదండ్రులు ఉరవకొండలోని ఓ ప్రయివేట్‌ ఆసుపత్రిలో వైద్యం చేయించారు. ఈ క్రమంలోనే రక్త కణాలు ఒక్కసారిగా తగ్గిపోవడంతో అత్యవసరంగా అనంతపురంలోని కార్పొరేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స ఫలించక బుధవారం ఉదయం అజీంబాషా కన్నుమూశాడు.  

శోకసంద్రం.. : బుధవారం అజీంబాషా జన్మదినం. కుమారుడి పుట్టినరోజును   ఘనంగా జరపాలనే ఉద్దేశంతో ఇప్పటికే తల్లిదండ్రులు ఏర్పాట్లు చేశారు. కుమా రుడికి కొత్త దుస్తులు కూడా తెచ్చారు. సంతోషంగా ఉన్న సమయంలో ఆజీంబాషా మృతితో వారి బాధ వర్ణనాతీతంగా మారింది. ఎంతో ఉల్లాసంగా, అందరితో కలివిడిగా ఉండే ఆజీంబాషా మృతితో పాత మార్కెట్‌ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉరవకొండ రూరల్‌ సీఐ ప్రవీణ్‌కుమార్, ఏఎస్‌ఐ గురికాల శివ,  కానిస్టేబుళ్లు కులశేఖర్‌రెడ్డి, ఓబుళేసు తదితరులు సంతాపం తెలిపారు.   

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)