Breaking News

కోరలు చాస్తున్నక్యాన్సర్‌

Published on Mon, 10/28/2024 - 04:28

సాక్షి, అమరావతి: దేశంలో క్యాన్సర్‌ రక్కసి కోరలు చాస్తోంది. 2022 సంవత్సరంలో ఒక్క రొమ్ము క్యాన్సర్‌ కారణంగానే దేశంలో 98,337 మంది మహిళలు మృతి చెందినట్లు గ్లోబల్‌ క్యాన్సర్‌ అబ్జర్వేటరీ (గ్లోబోకాన్‌) నివేదిక వెల్లడించింది. అదే ఏడాది నోటి క్యాన్సర్‌ బారినపడి 79,979 మరణించినట్లు ఆ నివేదిక తెలిపింది. 

ఇది కచ్చితంగా ప్రమాద సూచికేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. 2045 నాటికి క్యాన్సర్‌ కేసులు, మరణాల్లో గణనీయమైన వృద్ధి నమోదయ్యే ప్రమాదం ఉందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) కూడా హెచ్చరించింది. 

ముఖ్యంగా బ్రిక్స్‌ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల్లో క్యాన్సర్‌ విజృంభణపై ఐసీఎంఆర్‌ అధ్యయనం చేసింది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న రొమ్ము క్యాన్సర్‌ కేసుల్లో 33.6 శాతం, మరణాల్లో 36.9 శాతం బ్రిక్స్‌ దేశాల్లోనే ఉన్నట్టు వెల్లడించింది. అన్ని రకాల క్యాన్సర్‌ మరణాల్లో 42 శాతం ఈ దేశాల్లోనే సంభవించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.  

12.8 శాతం పెరుగుదల 
2020తో పోలిస్తే 2025లో దేశంలో 12.8 శాతం మేర క్యాన్సర్‌ కేసుల్లో వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మన దేశంలో పొగా­కు వినియోగం వల్ల పురుషుల్లో నోటి క్యాన్సర్‌ కేసు­లు ఎక్కువగా నమోదవుతున్నాయి.

మహిళల్లో రొ­మ్ము, గర్భాశయ క్యాన్సర్లు అధికంగా ఉన్నాయి. వీ­టి కారణంగానే అత్యధిక మరణాలు నమోదవుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక భా­రత్‌ మినహా మిగిలిన బ్రిక్స్‌ దేశాల్లో మరణాలకు ఊ­పిరితిత్తుల క్యాన్సర్‌ ప్రధాన కారణమని వెల్లడైంది.

మహిళలు 40 ఏళ్ల నుంచి జాగ్రత్తలు పాటించాలి 
మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయి. 10 శాతం రొమ్ము క్యాన్సర్‌లు వంశపారంపర్యంగా వస్తాయి. 90 శాతం కేసులు సాధారణంగా వస్తుంటాయి. కుటుంబంలో ఒక తరం స్త్రీకి 50 ఏళ్లలో క్యాన్సర్‌ బయటపడితే తర్వాతి తరంలోని ఆమె కూతుళ్లు, వారి సంతానం 10 ఏళ్లు ముందే అంటే 40 ఏళ్లకే జాగ్రత్త పడాలి. బ్రాకాజీన్‌ టెస్ట్‌ చేయించుకుంటే వంశపారంపర్యంగా వ్యాధి సంక్రమణను గుర్తించవచ్చు. 

మిగిలిన మహిళలైతే 40 ఏళ్ల నుంచే నెలసరి సమయంలో కాకుండా మిగిలిన రోజుల్లో ఇంట్లోనే బ్రెస్ట్‌ ఎగ్జామినేషన్‌ చేసుకోవాలి. గడ్డలు ఉన్నట్‌లైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 45 ఏళ్ల వయస్సు నుంచి రొమ్ము క్యాన్సర్‌కు మామోగ్రామ్, గర్భాశయ క్యాన్సర్‌కు పాప్‌స్మియర్‌ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. 

గర్భాశయ క్యాన్సర్‌ నుంచి రక్షణ కోసం బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది. గతంతో పోలిస్తే వైద్య రంగం అభివృద్ధి చెందింది. అధునాతన చికిత్సలు, మందులు అందుబాటులో ఉన్నాయి. అడ్వాన్స్‌డ్‌ స్టేజ్‌లో క్యాన్సర్‌ బయటపడినా చికిత్స చేయొచ్చు. – డాక్టర్‌ జె.విజయకృష్ణ, క్లినికల్‌ అంకాలజిస్ట్, విజయవాడ 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)