మధ్యాహ్న భోజనం తిని 9మంది విద్యార్థులకు అస్వస్థత

Published on Fri, 12/13/2024 - 05:40

చాట్రాయి: మధ్యాహ్న భోజనం తిని తొమ్మిదిమంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఏలూరు జిల్లా, చాట్రాయి మండలంలోని కోటపాడు యూపీ స్కూల్లో బుధవారం మధ్యాహ్నం 39 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేశారు. మెనూ ప్రకారం దుంప కుర్మా వారికి వడ్డించారు. 

భోజనం తిన్న అర గంట తర్వాత ఎన్‌.కల్పన, టి.క్రాంతి మేఘన, ఉమా యశ్వంత్, ఎం.దుర్గామనీష్, ఎన్‌.అమృత, ఎన్‌.లాస్య, టి.సిరి స్పందన, ఎన్‌.ఉదయకుమార్, టి.వర్షిణి కడుపు నొప్పితో బాధపడ్డారు. విషయం తెలిసిన చాట్రాయి పీహెచ్‌సీ వైద్యాధికారి విజయలక్ష్మి పాఠశాలకు వెళ్లి వారికి వైద్యం అందించారు. 

మళ్లీ గురువారం చనుబండ పీహెచ్‌సీ వైద్యాధికారి దుర్గాప్రసాద్‌ వెళ్లి విద్యార్థులకు వైద్యం చేసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. గురువారం మధ్యా­హ్నం భోజనం చేయగానే వీరిలో ఒకరికి కడుపు నొప్పి, మరొకరికి వాంతులు అవడంతో ఎంఈవో బ్రహ్మచారి 9 మంది విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

బుధవారం మెనూలో దుంప కుర్మా కూరలో రాగి పిండి కలిపి భోజనం పెట్టారని, విద్యార్థుల్లో అరుగుదల లేకపోవడం వలన గ్యాస్‌ కారణంగా కడుపు నొప్పి వచ్చిందని చాట్రాయి పీహెచ్‌సీ డాక్టర్‌ విజయలక్ష్మి తెలిపారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)