Breaking News

అమరావతిలో 58 అడుగుల అమరజీవి విగ్రహం

Published on Mon, 03/17/2025 - 04:48

సాక్షి, అమరావతి:  ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజుల పాటు కఠోర దీక్ష చేసి ఆత్మ బలిదానం చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తుతో రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. వచ్చే జయంతి నాటికి ఈ విగ్రహ నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. అమరావతిలోనే మెమోరియల్‌ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. 

అమరజీవి స్వగ్రామం పడమటిపల్లిలోని ఆయన నివాసాన్ని మ్యూజియంగా తీర్చిదిద్దుతామని, గ్రామంలో ఆధు­నిక వసతులతో ఆరోగ్య కేంద్రం, హైసూ్కల్‌ భవనాన్ని నిర్మిస్తామన్నారు. గ్రామస్తుల విన్నపం మేరకు బకింగ్‌ హామ్‌ కెనాల్‌పై బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఉండవల్లి నివాసంలో నిర్వహించిన పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో సీఎం పాల్గొని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. 

పొట్టి శ్రీరాములు త్యాగంతో ఏర్పడిన రాష్ట్రాన్ని 2047 నాటికి నంబర్‌వన్‌గా మార్చాలని పనిచేస్తున్నట్టు సీఎం తెలిపారు. నేటితో పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకల్లోకి అడుగుపెట్టడంతో వచ్చే ఏడాది మార్చి 16 వరకు ప్రతి నెలా ఒకటి చొప్పున 12 రకాల కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. రానున్న ఐదేళ్లలో పేదరిక నిర్మూలనకు, ప్రతివ్యక్తి జీవన ప్రమాణాలను పెంచేందుకు ఉగాది నుంచి పీ4 విధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు.  

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)