అనంత జీజీహెచ్‌లో దారుణం

Published on Wed, 07/29/2026 - 05:26

అనంతపురం సిటీ: అనంతపురం జిల్లా సర్వజనాస్పత్రి (జీజీహెచ్‌)లో దారుణం చోటు చేసుకుంది. పీడియాట్రిక్‌ వార్డులో చికిత్స పొందుతున్న 58 రోజుల పసికందును సొంత నానమ్మ రెండస్తుల ఎత్తు నుంచి కిందకు పడేసింది. వివరాల్లోకెళ్తే.. శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కంచి సముద్రం పంచాయతీ మామిడాకులపల్లికి చెందిన అశోక్‌ కుమార్‌ భార్య పూజిత మే 31న హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నవజాత శిశువుకు ఫిట్స్‌ వస్తుండడంతో మెరుగైన వైద్యం కోసం ఈనెల 22న జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. చిన్నారికి వైద్యులు రెండో అంతస్తులో ఉన్న పిడియాట్రిక్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు.

ఈ క్రమంలో మంగళవారం వేకువజామున ఒంటిగంట సమయంలో శిశువుకు పాలు పట్టి తల్లి నిద్రిస్తుండగా వారికి సహాయకురాలిగా ఉన్న చిన్నారి నానమ్మ పసికందును తీసుకెళ్లి రెండో అంతస్తు పైనుంచి కిందకు పడేసింది. అనంతరం ఏమీ తెలియనట్టు కోడలి వద్దకు వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత చిన్నారి కనిపించడం లేదంటూ హడావుడి చేసింది. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది చిన్నారి పడిపోయి ఉండటాన్ని గుర్తించగా, వెంటనే ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న అనంతపురం రెండో పట్టణ పోలీసులు జీజీహెచ్‌కు చేరుకుని విచారణ చేపట్టారు. ఆడ పిల్ల అని వద్దనుకున్నారా? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)