Breaking News

ఎన్నికల హింస కేసులో 54 మంది అరెస్టు

Published on Fri, 05/24/2024 - 03:57

నరసరావుపేట: పల్నాడు జిల్లాలో ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసపై గురువారం సిట్‌ కేసుల్లో 13 మందితో పాటు పోలింగ్‌కు ముందు, ఆ తర్వాత జరిగిన సంఘటనలకు సంబంధించి నమోదైన కేసుల్లో 54 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ వెల్లడించారు. ఎన్నికల నేరాల్లో ఈ ఒక్క రోజే తొమ్మిది మందికి 41 సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చామన్నారు. నరస­రా­వు­పేట సబ్‌ డివిజన్‌లో ఒకరు, సత్తెనపల్లి సబ్‌ డివిజన్‌ లో 46 మంది, గురజాల సబ్‌ డివిజన్‌లో 27 మందితో కలిపి 74 మందిని బైండోవర్‌ చేశామన్నారు.

నరసరావుపేట సబ్‌ డివిజన్‌లో ఐదుగురిపై రౌడీషీట్స్‌ ఓపెన్‌ చేసి, ఎన్నికల సమయంలో ట్రబుల్‌ మాంగర్స్‌గా గుర్తించినట్లు ఎస్పీ గార్గ్‌ తెలిపారు. బైండోవర్‌ చేసిన వారిలో నిబంధనలు ఉల్లంఘించిన ఐదుగురిని మెజి­స్ట్రేట్‌ ముందు హాజరుపర్చేందుకు నోటీసులు ఇచ్చారు. 102 సీఆర్‌పీసీ సెక్షన్‌లో ఒక వాహ­నాన్ని సీజ్‌ చేశామన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

పాల్వాయిగేటు ఎన్నికల సిబ్బందిపై వేటు
ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలంలోని పాల్వాయి గేటు 202వ పోలింగ్‌ స్టేషన్లో చోటుచేసుకున్న పరిణామాలపై ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులపై వేటు పడింది. ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా   విధులు నిర్వహించిన సత్తెనపల్లి జీజేసీ జూనియర్‌ కాలేజ్‌ జూనియర్‌ లెక్చరర్‌ పీవీ సుబ్బారావు, పోలింగ్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహించిన వెంకటాపురం జిల్లా పరిషత్‌ హైస్కూలు స్కూలు అసిస్టెంట్‌ షేక్‌ షహనాజ్‌ బేగంలను ఎన్నికల విధుల ఉల్లంఘన కారణంగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్‌ బి లత్కర్‌  గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ముగ్గురు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌
దర్శి: ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ వారికి ఓటు వేసేందుకు పోస్టల్‌ బ్యాలెట్‌కు రూ.5 వేలు లంచం తీసుకున్న కేసులో ముగ్గురు ఉపాధ్యాయులను కలెక్టర్‌ దినేష్‌­కు­మా­ర్‌ సస్పెండ్‌ చేశారు. సస్పెండ్‌ అయిన వారిలో గుత్తా నారాయణ, గోవిందు, అరుణ­కుమారి ఉన్నారు.

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)