Breaking News

‘షాక్‌’ ఇస్తే సర్వీసులెలా పెరిగాయి?.. ఈనాడు కథనం అవాస్తవం

Published on Fri, 08/04/2023 - 04:30

సాక్షి, అమరావతి: ఏపీ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌)లో గత రెండున్నరేళ్లలో చేనేత విద్యుత్‌ సర్వి సులు పెరిగాయని సంస్థ సీఎండీ కె. సంతోషరావు తెలిపారు. ‘నేతన్నలకు కరెంట్‌ షాక్‌’ అనే శీర్షికతో ఈనాడులో వచ్చిన కథనంపై గురువారం ఆయన స్పందించారు. నేతన్నలకు ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలో 2021–22 వరకూ 9,912 విద్యుత్‌ సర్వీసులు వుండగా, 2022–23 నాటికి ఆ సర్వి సుల సంఖ్య 10,125కు పెరిగిందని.. 2023–24 జూలై నాటికి మొత్తం 10,157 సర్వి సులున్నాయన్నారు.

అయితే, వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా పవర్‌ లూమ్స్‌ విద్యుత్‌ సర్వి సుల సంఖ్య తగ్గినట్లు ఈనాడు కథనంలో రాయడం అవాస్తవమన్నారు. షాక్‌ ఇస్తే సర్వి సులు ఎలా పెరిగాయని ఆయన ప్రశ్నించారు. చేనేత కార్మికులకు ఇంధన చార్జీల్లో 50 శాతం రాయితీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని తెలిపారు.

అలాగే, చేనేత కార్మికుల గృహాలకు నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని, నేతన్నల అభ్యర్థన మేరకు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) కిలోవాట్‌ హవర్‌ (కేడబ్ల్యూహెచ్‌) బిల్లింగ్‌ విధానానికి అనుమతించిందని తెలిపారు. ఈ ఉత్తర్వులవల్ల మగ్గాలకు సంబంధించిన సర్వీసుల విద్యుత్‌ బిల్లు కొంతమేరకు తగ్గినట్లు సీఎండీ వెల్లడించారు. 

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)