Breaking News

100 రోజుల్లో 5 నూతన పారిశ్రామిక పాలసీలు

Published on Thu, 08/01/2024 - 05:30

అమరావతి/మడకశిర: రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ అను­వైన వాతావరణం కల్పించేలా ఐదు నూతన పారి­శ్రామిక విధానాలను 100 రోజుల్లోగా అందుబా­టులోకి తేవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. నూతన పారిశ్రామిక విధానంతో పాటు ఎంఎస్‌ఎంఈ పాలసీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ, ఎలక్ట్రానిక్, ఐటీ అండ్‌  క్లౌడ్‌ పాలసీ, టెక్స్‌ టైల్‌ పాలసీలు తేవాలని సూచించారు. సచివాల­యంలో బుధవారం పరిశ్రమల శాఖపై  సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా­డుతూ రాష్ట్రాన్ని గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌ ఎనర్జీ హబ్‌­గా చేయాలన్న లక్ష్యంతో పాలసీలు రూపొందించాలని సూచించారు. 

కుప్పం, మూలపేట, చిలమ­త్తూరు,  దొనకొండ లేదా పామూరులో కొత్త పారిశ్రామిక క్లస్టర్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఫుడ్‌ ప్రాసెసింగ్, హార్డ్‌ వేర్‌ సంస్థల ఏర్పాటుకు కృషి చేయాలని చెప్పారు. కృష్ణపట్నం, నక్కపల్లి, ఒర్వకల్లు, కొప్పర్తి నోడ్స్‌ పనితీరుతో పాటు నక్కపల్లిలో రూ.11,542 కోట్లతో ఏర్పాటు చేసే బల్క్‌ డ్రగ్‌ పార్క్, రూ.60 వేల కోట్లతో ఏర్పాటయ్యే ఎన్‌టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్, ప్రస్తుతం చర్చలు జరుపుతున్న బీపీసీఎల్‌ ప్రాజెక్టుల స్థితిగతులపై సీఎం సమీక్షించారు.

ప్రోత్సాహకాల అంశాన్ని పరిశీలిస్తాం..
2014–19 హయాంలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకుని వెనక్కి వెళ్లిపోయిన పారిశ్రా­మికవేత్తలతో తిరిగి సంప్రదింపులు జరపాలని, అవసరమైతే తానే వారితో మాట్లాడతానని సీఎం చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో పనులు ప్రారంభించిన ప్రాజెక్టులను వేగవంతం చేయడం ద్వారా ఏడాదిలో  లక్ష కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులు పూర్తి చేసి 1,36,260 మందికి ఉపాధి కల్పించాలన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక వాడలో భూముల రేట్లు తగ్గించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

నేడు సత్యసాయి జిల్లాకు చంద్రబాబు
సీఎం చంద్రబాబు గురువారం శ్రీసత్య­సాయి జిల్లాలో పర్యటించనున్నారు. మడ­కశిర మండలం కె.గుండుమలలో మ«ధ్యా­హ్నం 2.20 గంటలకు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. గ్రామ ప్రజలు, పట్టు రైతులతో ముఖా­ముఖి సమావేశమవుతారు. మల్బరీ షెడ్, పట్టు పురుగుల పెంపకాన్ని పరిశీలిస్తారు. 

కాగా, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర  శాఖ కార్యదర్శి కె.రామకృష్ణ సీఎం చంద్రబాబును సచివాలయంలో బుధవారం కలిశారు. అలాగే టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో కుప్పం నియోజకవర్గానికి చెందిన పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అదే విధంగా సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సమావేశమయ్యారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)