Breaking News

36.6 శాతం గృహాలు... స్వచ్ఛ ఇంధనానికి దూరం

Published on Mon, 11/18/2024 - 05:51

సాక్షి, అమరావతి: దేశంలో ఇంకా 36.6 శాతం గృహాలు వంట కోసం స్వచ్ఛ ఇంధనానికి (గ్యాస్‌) దూరంగా ఉన్నాయి. పట్టణాల్లో 92.9 శాతం స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం సగానికిపైగా కుటుంబాలు స్వచ్ఛ ఇంధనానికి నోచుకోలేదని సమగ్ర వార్షిక మాడ్యులర్‌ సర్వే 2022–23 వెల్లడించింది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 49.3 శాతం గృహాలు మాత్రమే వంట కోసం స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తున్నాయి.

మిగతా 50.7 శాతం కుటుంబాలు కట్టెలు, బొగ్గులనే వాడు­తున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో కలిపి దేశంలో 63.4శాతం గృహాలు మాత్రమే వంట కోసం స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తున్నాయి. మిగతా 36.6 శాతం కట్టెలు, బొగ్గు వంటి వాటిపైనే ఆధారపడుతున్నాయి. అయితే ఏపీలో జాతీయ స్థాయికి మించి గ్రామీణ, పట్టణాల్లో కలిపి 88.0 శాతం గృహాలు వంట కోసం స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తున్నాయని సర్వే వెల్లడించింది.

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 84.1 శాతం గృహాలు స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తుండగా, పట్టణాల్లో 96.7 శాతం గృహాలు స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సగం గృహాలు కూడా వంట కోసం స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగించడం లేదని సర్వే వెల్లడించింది. అరుణాచల్‌ప్రదేశ్, అసోం, బిహార్, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్,  పశి్చమబెంగాల్‌ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సగం గృహాలు వంట కోసం స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగించడం లేదని సర్వే తెలిపింది. 

స్వచ్ఛ ఇంధనం అంటే.. 
వంట కోసం ఎల్‌పీజీ, ఇతర సహజ వాయువులు, గోబర్‌ గ్యాస్, ఇతర బయోగ్యాస్‌ విద్యుత్, సోలార్‌ కుక్కర్‌ వంటివి వినియోగించడం 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)