Breaking News

హైకోర్టుల్లో 331 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీలు

Published on Sat, 06/08/2024 - 03:22

సాక్షి, అమరావతి:  దేశంలోని వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 331 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే రాష్ట్రాల్లోని జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లో 5,432 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. సుప్రీం కోర్టుతో పాటు వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపింది.

న్యాయ­మూర్తులు పదవీ విరమణ, రాజీనామాలు, పదోన్నతుల ద్వారా ఖాళీ అయిన న్యాయమూర్తుల పదవులను వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.  నిబంధనల ప్రకారం జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లో న్యాయమూర్తుల ఎంపిక, నియామకాల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపింది. అలహాబాద్‌ హైకోర్టులో అత్యధికంగా 70 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆ తరువాత పంజాబ్, హరియాణ హైకోర్టులో 29 న్యాయమూర్తుల పోస్టులు, బాంబే హైకోర్టులో 25 న్యాయమూర్తుల పోస్టులు, కోల్‌కత్తా, గుజరాత్‌ హైకోర్టుల్లో 21 చొప్పున న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు  వెల్లడించింది. తెలంగాణలో 16, ఏపీలో 7 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయంది.

ఉత్తరప్రదేశ్‌లో జిల్లాలు, సబార్డినేట్‌ కోర్టుల్లో  1,250 జడ్జిల పోస్టులు ఖాళీగా ఉన్నాయని,  గుజరాత్‌లో జిల్లాలు, సబార్డినేట్‌ కోర్టు­ల్లో 535 న్యాయమూర్తుల పదవులు, బిహార్‌లో జిల్లాలు, సబార్డినేట్‌ కోర్టుల్లో 467 జడ్జిల పోస్టులు, తమిళనాడులో జిల్లాలు, సబార్డినేట్‌ కోర్టుల్లో 334 న్యాయమూర్తుల పోస్టులు, రాజస్థాన్‌లో జిల్లాలు, సబార్డినేట్‌ కోర్టుల్లో 300 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయంది. ఏపీలో జిల్లాలు, సబారి్టనేట్‌ కోర్టుల్లో 84, తెలంగాణలో  115 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)