Breaking News

విశాఖ తీరం నుంచి 3,240 కి.మీ. డేంజర్‌ జోన్‌

Published on Sat, 12/20/2025 - 05:39

సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో విశాఖ సముద్రతీరం నుంచి హిందూమహాసముద్రం వరకూ 3,240 కిలోమీటర్ల పరిధిని క్షిపణి పరీక్ష కోసం నో ఫ్లైయింగ్‌ జోన్‌గా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం  నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటీస్‌ టు ఎయిర్‌మెన్‌ (నోటమ్‌) ప్రకారం ఈ మిసైల్‌ టెస్టింగ్‌ ఈనెల 22 నుంచి 24 మధ్య జరగనుందని స్పష్టం చేసింది. తొలుత  డిసెంబర్‌ 1 నుంచి 4 తేదీల్లో మిసైల్‌ టెస్టింగ్‌ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం అప్పట్లో 3,485 కి.మీ ప్రాంతాన్ని డేంజర్‌ జోన్‌గా గుర్తించారు. దాన్ని రద్దు చేస్తూ ఈ నెల 7న మరోసారి కొత్త నో ఫ్లైజోన్‌ను 1190 కిలోమీటర్లుగా ప్రకటించారు.

మళ్లీ శుక్రవారం తాజాగా నోటమ్‌ జారీ చేశారు. ఇందుకోసం మొత్తం 3,240 కి.మీ తీర ప్రాంతం వరకూ డేంజర్‌ జోన్‌గా డిక్లేర్‌ చేశారు. విమాన కార్యకలాపాలు, సముద్ర భద్రతను ప్రభావితం చేసేందుకు యుద్ధ నౌకలు, జలాంతర్గాములను అప్రమత్తం చేసేందుకు ఈ డేంజర్‌ జోన్‌ను ప్రకటించారు. పైలెట్లు, విమానయాన సంస్థలు, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లకు నోటమ్‌ ద్వారా అధికారిక నోటిఫికేషన్‌ అందజేయనున్నారు.

విమాన ప్రయాణానికి ఆటంకం కలిగించే మార్పులు లేదా ప్రమాదాల గురించి పైలెట్లు, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లు, విమానయాన సిబ్బందికి ముందుగానే ఇచ్చే హెచ్చరిక ప్రకటననే ’నోటమ్‌’ అని పిలుస్తారు. ఈ డేంజర్‌ జోన్‌ ప్రకటన ఉన్నంతవరకూ ఆ పరిధిలో పౌర,యుద్ధ విమానాలను దారిమళ్లిస్తారు. భారత కాలమానం ప్రకారం ఈనెల 22వ తేదీ ఉదయం 4.30 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 8.30 గంటల మధ్య ఎప్పుడైనా ఈ మిసైల్‌ టెస్టింగ్‌ ఉండే అ­వకాశం ఉందని భారతరక్షణ వర్గాల సమాచారం.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)