Breaking News

పేరుకుపోతున్న బకాయిలు

Published on Thu, 01/29/2026 - 05:40

సాక్షి, అమరావతి: ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలవాల్సిన వైద్యశాఖను ప్రభుత్వం అస్తవ్యస్తం చేస్తోంది. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్ల మేర బకాయిలు చెల్లించకుండా పథ­కాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. మరోవైపు ప్రభుత్వాస్పత్రులకు మందులు, సర్జికల్స్, వైద్య పరికరాలు సరఫరా చేసిన కంపెనీలకు ప్రభుత్వం నిధులు విదల్చడం లేదు. రూ.వందల కోట్ల బిల్లులను కనీసం ప్రాసెస్‌ చేయకుండా ఏపీఎంఎస్‌ఐడీసీ స్థాయిలోనే తొక్కి పెట్టేస్తున్నారు. దీంతో మందులు, సర్జికల్స్‌ సరఫరా చేయలేమంటూ కంపెనీలు చేతులెత్తేస్తు­న్నాయి. 

ప్రభుత్వం కంపెనీలకు ఏకంగా రూ.500 కోట్ల మేర బకాయి పడినట్టు తెలుస్తోంది. ఆ బిల్లులను రాబట్టు­కోవడం కోసం సరఫరా­దారు­లు వైద్య, ఆర్థిక, శాఖలతో పాటు ‘ముఖ్య’­నేత కార్యాలయంలోని ఉన్నతాధికారులను ప్రాధేయ
ç­³డుతున్నప్పటికీ నిధులు మాత్రం రావడం లేదు. మొత్తం పెండింగ్‌ బిల్లుల్లో రూ.200 కోట్ల మేర ఇప్పటికే ఎంఎస్‌ఐడీసీ నుంచి ప్రాసెస్‌ చేసి సీఎఫ్‌ఎంఎస్‌కు ఎక్కించారు. రూ.150 కోట్ల మేర నేషనల్‌ హెల్త్‌ మిషన్‌­(ఎన్‌హెచ్‌ఎం) బిల్లులు ఆగిపోయాయి. 

మరో రూ.150 కోట్ల మేర బిల్లులు పూర్తిస్థాయిలో ప్రాసెస్‌కు నోచుకోవడం లేదు. ఇంత పెద్దమొత్తంలో బిల్లులు నిలిచిపో­వడంతో నాలుగో క్వార్టర్‌ సరఫరా చేయలేమని ఇప్పటికే పలు కంపెనీలు అధికారులకు తెగేసి చెప్పినట్టు సమాచారం. గత కొద్ది నెలలుగా బాబు గద్దెనెక్కిన నాటి నుంచి ప్రభుత్వాస్పత్రు­లను మందులు, సర్జికల్స్‌ కొరత వేధిస్తోంది. నిబంధనల మేరకు ఉండాల్సిన అన్ని మందులు, సర్జికల్స్‌ అందుబాటులో ఉండడం లేదు. 

మందులు బయట నుంచి తెచ్చుకోవాలట..
ఈ నేపథ్యంలో మందులు, సర్జికల్స్‌ బయట కొనుక్కోవాలని రోగులకు సిబ్బంది చీటీలు రాసిస్తున్నారు. గత నెలలో ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్‌­ఎస్‌ సర్వేలోనూ డీఎంఈ ఆస్పత్రుల్లో వైద్యులు రాసిచ్చిన మందులు ఉచితంగా ఇవ్వలేదని దాదాపు 40 శాతం మేర రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇంత దుర్భర పరిస్థితులు ఉంటే సరఫరా అయిన అరకొర మందులకు కూడా ప్రభుత్వం కంపెనీలకు సకాలంలో నిధులు మంజూరు చేయడం లేదు. 

అంతేకాకుండా ప్రభుత్వా­స్పత్రులకు కూడా ఆరోగ్యశ్రీ నిధులను చెల్లించకపోవడంతో జీజీహె­చ్‌లలో పరిస్థితి దారుణంగా మారింది. ప్రభుత్వం సరఫరా చేయని మందులను జీజీహెచ్‌లకు వచ్చే ఆరోగ్యశ్రీ నిధులతో కొనుగోలు చేస్తుంటారు. ఆ నిధులను చెల్లించకపోవడంతో ఆస్పత్రులకు సైతం మందులు, సర్జికల్స్‌ ఇవ్వలేమని కంపె­నీలు తేల్చి చెప్పేస్తున్నాయి.  

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)