Breaking News

ఎస్‌ఆర్‌ఎంలో 300 మంది విద్యార్థులకు అస్వస్థత

Published on Fri, 11/07/2025 - 04:36

మంగళగిరి టౌన్‌: గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేశారు. యూనివర్శిటీలో ఫుడ్‌ పాయిజన్‌ ఘట­న­పై గుంటూరు జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా విచారణ కమిటీ ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశా­రు. కమిటీలో తెనాలి సబ్‌ కలెక్టర్, ఉన్నత విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, ఆహార తనిఖీ అధికారి, పౌర సరఫరాల అధికారులను నియమించారు. 

కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఎస్‌­ఆర్‌ఎం యూనివర్శిటీలో  అధికా­రు­లు తనిఖీలు చేశారు. క్యాంటీన్‌లో ఆహా­రం నాసి­రకంగా ఉన్నట్లు గుర్తించా­మని తెనాలి సబ్‌ కలెక్టర్‌ సంజన సిన్హా తెలిపారు. దాదాపు 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, వా­రం రోజుల నుంచి రోజుకు 50 మంది అస్వస్థతకు గురవుతున్నారని, పలు­వురు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. ఇద్దరు విద్యార్థులు మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. 

ఆరుగురితో కమిటీ 
ఈ సందర్భంగా మంగళగిరి తహసీల్దార్‌ కార్యాలయంలో సబ్‌ కలెక్టర్‌ సంజనా సిన్హా మీడియాతో మాట్లాడారు. ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై వాస్తవాలను నిర్ధారించి చర్యలకు ఉపక్రమించేందుకు జిల్లా కలెక్టర్‌ ఆరుగురితో కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ ఘటనకు కారణమేమిటన్నది ఖచి్చతంగా తెలుసుకునేందుకు పూర్తిస్థాయి విచారణ కొనసాగుతుందన్నారు. 

సీఆర్డీఏ పరిధిలోని గ్రామాల నుంచి సరఫరా అవుతున్న నీటి వలన సమస్య తలెత్తిందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలియజేశారు. ఆహారం వండేందుకు వినియోగిస్తున్న నీరు, తాగునీరు శాంపిల్స్‌ను ప్రయోగశాలకు పంపినట్లు చెప్పారు. నివేదిక ఆధారంగా యూనివర్శిటీకి మెమో జారీ చేస్తామని తెలిపారు. గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగిన దాఖలాలు ఉన్నాయని, నివేదిక ఆధారంగా యూనివర్శిటీపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.   

ఎస్‌ఆర్‌ఎం వర్శిటీకి సెలవులు  
ఇదిలా ఉంటే ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీకి ఈ నెల 7వ తేదీ నుంచి 23వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు యూనివర్శిటీ రిజిస్ట్రార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూనివర్శిటీ హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ వల్ల పలువురు అనారోగ్యానికి గురైనట్టు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని యూనివర్శిటీ అంతటా శానిటేషన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని, మెస్‌తోపాటు వంట గదులు, హాస్టల్‌ మొత్తం శుభ్రం చేస్తున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో రెండు వారాలపాటు సెలవులు ఇచి్చనట్టు వెల్లడించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)