Breaking News

అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 వేల ఎకరాలు

Published on Wed, 04/16/2025 - 02:29

తాడికొండ: అమరావతిలో మరోసారి భూ సమీకరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూనే అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 30 వేల ఎకరాలు సమీకరిస్తామని రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన అ­నంతవరంలోని గ్రావెల్‌ క్వారీలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు, అమరావతిని కలిపి త్వరలో మెగాసిటీగా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో సీఎం చంద్రబాబు ఉన్నారని చెప్పారు. 

ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం నిర్మాణం చేపట్టాల­ని నిర్ణయించారని, ఇందుకోసం 30 వేల ఎకరాల భూమి సమీకరించాల్సి ఉంటుందన్నారు. ఇందులో రైతులకు రిటర్నబుల్‌ ప్లాట్లు ఇవ్వగా మిగిలిన భూముల్లో రోడ్లు, డ్రెయిన్లు, ఇతర మౌలిక వసతుల కోసం మరికొన్ని వేల ఎకరాలు అవసరం ఉంటుందని తెలిపారు. ఇవన్నీ పోగా ఐదు వేల ఎకరాలు మాత్రమే  మిగులుతుందని, అందుకే ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా ఇంకా ఎక్కువ భూమి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. 

సేకరణ ద్వారా భూములు తీసుకుంటే రిజిస్ట్రేషన్‌ ధరలో రెండున్నర రెట్లు మాత్రమే ఎక్కువ వస్తుందని, అలా కాకుండా ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా తీసుకుంటే రైతులకు ప్రయోజనం ఉంటుందని.. రైతులు కూడా ల్యాండ్‌ పూలింగ్‌ను కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అయినా.. భూ సమీకరణా లేదా భూసేకరణా అనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)