Breaking News

పంట కాల్వలోకి బోల్తా కొట్టిన ఆటో.. ముగ్గురి దుర్మరణం

Published on Fri, 12/12/2025 - 15:37

దోనెపూడి: బాపట్ల జిల్లాలోని దోనెపూడి దగ్గరు చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు.  కొబ్బిరి కాయలతో వెళుతున్న ఓ ఆటో పంట కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఆటో ఐదుగురు ప్రయాణికులు ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకంది. అతి వేగమే ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమం ఉన్నట్ల సమాచారం. వీరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుల్ని చాటగడ్డ కాంతారావు, పెసర్లంక శ్రీనివాస్‌, షేక్‌ ఇస్మాయిల్‌గా గుర్తించారు. 

ఇదిలా ఉంచితే, ఈరోజు(శుక్రవారం, డిసెంబర్‌ 12వ తేదీ) తెల్లవారుజామున అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ బస్సు గోరింట గట్టులోకి పడిపోవడంతో కనీసం 9 మంది మృతి చెందగా, 23 మంది వరకూ గాయపడ్డారు. 

చింతూరు మండలంలోని తులసిపకల ఘాట్ రోడ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  37మంది ప్రయాణికులతో బస్సు వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగింది.  ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన వారిని వెంటనే భద్రాచలం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తన్నారు.ఈ ప్రమాదం తర్వాత పోలీసులు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఘాట్ రోడ్లపై భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. పొగమంచు  ఎక్కువగా ఉండటంతో క్లియరెన్స్‌ మందగించి ప్రమాదం జరిగిందని అంచనాకు వచ్చిన పోలీసు అధికారులు.. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకూ భారీ వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు.

రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు

  •  60 కంటే ఎక్కువ వేగంతో వాహనాలు నడపడంతో డ్రైవర్ల నియంత్రణ కోల్పోతున్నారు.

  • మద్యం తీసుకోవడం, మత్తు పదార్థాలు తీసుకున్ని డ్రైవింగ్‌ చేయడం కూడా ప్రమాదాలకు కారణంగా మారుతుంది.

  • డ్రైవింగ్‌ చేస్తున్నప్పడు ఫోన్‌లో మాట్లాడటం, మెసేజ్ టైప్ చేయడం వాహనం మీద నియంత్రణ కోల్పోవడం ఒక కారణం.

  •  నిబంధనలు పాటించకుండా వ్రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌ చేయడం మరో కారణం.

  • ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి సిగ్నల్‌ జంప్‌ చేయడం వంటివి కూడా ప్రమాదాలకు కారణం.

  • హెల్మెట్, సీట్‌బెల్ట్ వంటి సేఫ్లీ పరికరాలు వాడకపోవడం వల్ల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. 

  •  వాహనాలు బ్రేక్ ఫెయిల్, టైర్ బ్లాస్ట్ వంటి సమస్యలు.

  •  భారీ వర్షాలు కానీ, పొగమంచు ఉన్నప్పుడు కానీ సరైన లైటింగ్‌ లేకపోవడంతో ఎక్కువ ప్రమాదాలు జరగడానికి ఒక కారణం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)