Breaking News

3 కొత్త పొగాకు వంగడాల విడుదల

Published on Fri, 07/21/2023 - 04:52

రాజమహేంద్రవరం రూరల్‌: కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్‌–సీటీఆర్‌ఐ) ద్వా­రా దక్షిణ, ఉత్తర ప్రాంత తేలిక నేలలు, బర్లీ ప్రాంతాల­కు అనువైన 3 అధిక దిగుబడులను ఇచ్చే పొగాకు వంగడాలు విడుదలయ్యాయి. ఈ విషయాన్ని తూర్పు గోదావరి జిల్లా రాజ­మ­హేం­ద్రవరం సీటీఆర్‌ఐ డైరెక్టర్‌ డా.మాగంటి శేషుమాధవ్‌ గురువారం తెలిపారు. ఎఫ్‌సీఆర్‌–15 (సీటీఆర్‌ఐ శ్రేష్ట) వంగడం దక్షిణ తేలిక నేల­లకు అనువైనదన్నారు. ఇది అధిక దిగు­బడి­ని (హెక్టార్‌కు 3,000 కిలోలు) ఇస్తుందన్నారు. ఇది శీతాఫల తెగులు తట్టుకునే బ్యారన్‌ పొగా­కు రకమన్నారు.

ఎఫ్‌సీజే–11 (సీటీఆర్‌ఐ నవీన­) వంగడం ఉత్తర తేలిక నేలలకు అనువైనదన్నారు. ఇది కూడా ఎక్కువ దిగుబడి­నిచ్చే (హెక్టార్‌కు 3,300 కిలోలు) వంగడమని పేర్కొన్నారు. తక్కువ నత్రజనితో సాగు సామ­ర్థ్యం కలిగిన బ్యారన్‌ పొగాకు రక­మన్నారు. వైబీ–22 (విజేత) వంగడం అధిక దిగుబ­డినిచ్చే (హెక్టార్‌కు 2,900 కిలో­లు), శీతా­ఫల తెగులు తట్టుకునే బర్లీ పొగాకు రకమన్నారు. ఈ 3 వంగడాలను స్టేట్‌ వెరైటీ రిలీజ్‌ కమిటీ (ఎస్‌వీఆర్‌సీ) విడుదల చేసిందన్నారు. ఈ వంగడాల విత్తనాలు ప్రస్తుత సీజన్‌లో సీటీఆర్‌ఐలో లభ్యమవుతు­న్నాయని చెప్పారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)