Breaking News

స్త్రీలకు ఉచిత ప్రయాణం అమలుకు 2,536 అదనపు బస్సులు అవసరం

Published on Sun, 06/29/2025 - 05:21

సాక్షి, అమరావతి: మహిళలకు ఉచిత బస్సు ప్ర­యాణ పథకం అమలులోకి వస్తే అదనంగా 2,536 బస్సులు అవసర­మని అధికారులు లెక్కలు తేల్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం మహిళల సంఖ్య 2.62 కోట్లు. దీంతోపాటు వారు ప్రస్తుతం చేసే ప్రయాణాలను బట్టి ఉచిత పథకం అమలైతే ఏడాదికి 88.90 కోట్ల ప్రయాణాలు పెరి­గే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనికి రూ.996 కోట్లు వ్యయం కానుందని లెక్కగట్టింది. 

దీనికి అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలుపై దృష్టిసారించాలని, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయన శనివారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో చర్చించారు. ఇకపై ఆర్టీసీలో ప్రవేశపెట్టేవన్నీ ఈవీ ఏసీ బస్సులే ఉండాలని, ఇప్పుడున్న బస్సులను కూడా ఈవీలుగా మార్చేందుకు ఉన్న అవకాశాల­పై అధ్యయనం చేయాలని చెప్పారు. ప్రతి బస్సు­కూ జీపీఎస్‌ అమర్చాలని ఆదేశించారు.  

స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యం 
స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యమివ్వాలని, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ము­న్సి­పల్‌ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. శనివారం మున్సిపల్‌ శాఖపై సీఎం సమీక్షించారు. వర్షాకాలం సమీపిస్తున్నందున చేపట్టాల్సిన పారిశుద్ధ్య చర్యలను వివరించారు. విద్యుత్‌ పొదుపుపై దృష్టి సారించాలని ఆదేశించారు. అన్నక్యాంటీన్లలో నాణ్యతపై చర్చించారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)