Breaking News

14 నుంచి ‘వలంటీర్లకు వందనం’

Published on Sun, 04/09/2023 - 05:01

సాక్షి, అమరావతి: అవినీతికి తావు లేకుండా.. కులం, మతం, వర్గం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వివిధ సంక్షేమ పథకాల అమలులో వారధులుగా పనిచేస్తున్న గ్రామ, వార్డు వలంటీర్లను ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది కూడా సత్కరించనుంది. కనీసం ఏడాదిపాటు వలంటీర్‌గా పనిచేస్తూ ఎటువంటి ఫిర్యాదులకు తావులేని మొత్తం 2,33,719 మంది వలంటీ­ర్లను ఈ ఏడాది సత్కరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వలంటీర్ల సత్కారాల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 14న తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో లాంఛనం­గా ప్రారంభించనున్నారు.

అనంతరం దాదాపు నెల రోజులపాటు సచివాలయాల వారీగా ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సత్కార కార్యక్ర­మాలు కొనసాగుతాయి. సీఎం వైఎస్‌ జగన్‌అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే 2019 ఆగస్టు 15వ తేదీన వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కేవలం గౌరవ వేతనంతోనే నిస్వార్థంగా పనిచేస్తున్న వలంటీర్ల సేవలను గుర్తిస్తూ ఏటా ఉగాది సందర్భంగా ‘వలంటీర్లకు వందనం’ పేరుతో ఈ సత్కారాలను నిర్వహిస్తోంది.

2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను 2021 ఏప్రిల్‌ 14న వలంటీర్ల సత్కారాల కార్యక్రమం నిర్వహించగా.. మరుసటి ఏడాది ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి ఈ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఉగాది సమయంలో రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో ఈ నెల 14వ తేదీ నుంచి ప్రభుత్వం వలంటీర్ల సత్కారాల కార్యక్రమాన్ని నిర్వహించనుంది. 

అవార్డులతో పాటు నగదు పురస్కారం
♦ ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 875 మంది వలంటీర్లను ‘సేవా వజ్ర’ పురస్కారం, రూ.30 వేల నగదు, మెడల్, బ్యాడ్జి, శాలువా,  సర్టిఫికెట్‌తో సత్కరిస్తారు.
♦ ప్రతి మండలం, మునిసిపాలిటీ నుంచి ఐదు­గురు చొప్పున, నగరపాలక సంస్థ నుంచి 10 మంది  చొప్పున ఎంపిక చేసి మొత్తంగా 4,220 మందికి ‘సేవారత్న’ అవా­ర్డు, రూ. 20 వేల నగదు, మెడల్, బ్యాడ్జి, శాలువా, సర్టిఫికెట్‌ అందజేసి సత్కరిస్తారు.
♦2,28,624 మందికి ‘సేవావిుత్ర’ పురస్కారం, రూ.10 వేల నగదు అందజేస్తారు.
♦వలంటీర్ల పనితీరు, ఆ ప్రాంత కుటుంబాలు వ్యక్తం చేస్తున్న సంతృప్తి, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వలంటీర్ల హాజ­రు, ప్రతి నెలా మొదటి రోజునే వంద శాతం లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ, వివిధ సంక్షేమ పథకాల అమలులో వలంటీర్ల క్లస్టర్ల పరిధిలో లబ్ధిదారుల గుర్తింపు వివరాల నమోదు తదితర అంశాల ఆధారంగా సేవా వజ్ర, సేవారత్న అవార్డులకు వలంటీర్లను ఎంపిక చేసినట్టు అధికారులు వెల్లడించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)