అమ్మా.. నేను సూర్యతో వెళ్లిపోతున్నా!

Published on Sat, 12/21/2024 - 13:46

రాప్తాడు రూరల్‌: ‘అమ్మా నా కోసం ఎక్కడా వెతకొద్దు. ప్రేమించిన వ్యక్తి వద్దకు వెళ్తున్నా’ అంటూ లేఖ రాసి ఓ యువతి అదృశ్యమైన ఘటన గురువారం అనంతపురం రూరల్‌ మండలం కురుగుంటలో వెలుగు చూసింది. అనంతపురం రూరల్‌ పోలీసులు తెలిపిన మేరకు... కురుగుంటలో నివాసముంటున్న ముస్లిం దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త చనిపోయాడు. కుమారుడు బైకు మెకానిక్‌గా పని చేస్తుండగా, 22 ఏళ్ల వయసున్న కుమార్తె నగరంలోని ఓ షోరూంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ వదిలేసింది. ఈ క్రమంలో గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. 

సాయంత్రమైనా తిరిగి రాలేదు. దీంతో తల్లి ఇంట్లో పరిశీలించగా ఓ లేఖ లభించింది. అందులో ‘అమ్మా... నేను సూర్య అనే యువకుడిని ప్రేమించా. ఆయనతోనే వెళ్తున్నా. మీరు నా కోసం వెతకొద్దు. విజయవాడ వెళ్తున్నా. వాళ్ల అమ్మానాన్న కూడా నన్ను బాగా చూసుకుంటారు. ఇంట్లో బంగారు, డబ్బులేవీ తీసుకెళ్లడం లేదు. అన్నా... అమ్మను బాగా చూసుకో’ అంటూ రాసి ఉంది. ఈ లేఖను స్వాధీనం చేసుకున్న అనంతపురం రూరల్‌ పోలీసులు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

యువతి అదృశ్యం
కదిరి టౌన్‌: స్థానిక మున్సిపల్‌ పరిధిలోని రాజీవ్‌ నగర్‌లో నివాసముంటున్న యువతి కనిపించడం లేదు. ఈ మేరకు తల్లి ఫిర్యాదు చేయడంతో పట్టణ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. బంధువుల అబ్బాయితో ఈ నెల 18న ఎస్టీఎస్‌ఎన్‌ డిగ్రీ కళాశాల వెనుక ఉన్న ఫంక్షన్‌ హాల్‌లో ఆమెకు వివాహ నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. దీంతో బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ఆమె ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కదిరికి చెందిన మునివర్ధన్‌ (గజ), చిన్నాన్న పవన్‌ కారణమంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)