Breaking News

చిన్న పరిశ్రమలు చితికిపోతున్నాయి

Published on Mon, 08/25/2025 - 03:43

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలు తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఇవి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ఫలితంగా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ యూనిట్లు ఇప్పుడు తెగ మూతపడుతున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖే సాక్షాత్తు  పార్లమెంటులో ఇటీవలే వెల్లడించింది. 

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఈ ఏడాది జూలై 28 వరకు మొత్తం 2,191 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు మూతపడినట్లు తెలిపింది. 2024–­25 ఆర్థిక సంవత్సరంలో 1,401 యూనిట్లు ఈ ఆరి్థక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లోనే 790కి పైగా యూనిట్లు మూతపడ్డాయంటే రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధంచేసుకోవచ్చు. ఎంఎస్‌ఎంఈలు ఇలా మూతపడుతుండటంతో సుమారుగా 30,000 మంది ఉపాధి కోల్పోయినట్లు అంచనా.

షాక్‌ కొడుతున్న విద్యుత్‌ బిల్లులు.. 
టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి రాగానే బిల్లుల రూపంలో ఎంఎస్‌ఎంఈలకు గట్టిగా కరెంట్‌ షాక్‌ ఇచ్చింది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏపీలోని ఎంఎస్‌ఎంఈలపై విద్యుత్‌ బిల్లుల భారం విపరీతంగా పెరిగిపోయింది. అలాగే, పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడం, మానవ వనరుల కొరత, ముడి సరుకుల ధరలు పెరుగుదల, ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వంటివి వీటిని వెంటాడుతున్నాయి. 

విజయవాడ కేంద్రంగా పనిచేసే ఒక ఎంఎస్‌ఎంఈకి సగటున యూని­ట్‌ ఛార్జీ రూ.13.55 పడితే అదే తమిళనాడులో సగటున యూనిట్‌ ధర 7–8లు­గా ఉంది. అంటే యూనిట్‌కు దాదాపు రూ.6 అదనం. ఈ స్థాయిలో విద్యుత్‌ బిల్లు­లు బాదితే ఇతర రాష్ట్రాలతో ఎలా పోటీపడాలని ఆ సంస్థ ప్రతినిధి వాపోయారు.  

ప్రోత్సాహకాల ఊసేలేదు..
ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ ఏడాది ప్రోత్సాహకాలు ఆ ఏడాదే ఇచ్చేస్తాం.. ఇందుకోసం ప్రత్యేకంగా కార్పస్‌ ఫండ్‌ పెడుతున్నామన్న చంద్రబాబు, ఇతర కూటమి నేతల మాటలు నీటిమూటలయ్యాయి. సుమారు రూ.10,000 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాల్లో కనీసం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఇవి ఇవ్వకపోగా వీటిని అడగడానికి వెళ్లిన పారిశ్రామిక ప్రతినిధులను అధికారులు పీ–4 దత్తత అంటూ వేధిస్తున్నారని వారు వాపోతున్నారు. 

పరిశ్రమ నడపడానికి, జీతాలివ్వడానికి మా దగ్గర డబ్బుల్లేవని చెబుతున్నా.. ఆ సంగతి తర్వాత చూద్దాంలే ముందు రెండొందల బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్న­ట్లు ప్రకటన చేయమనడంతో చేసేదిలేక మొ­క్కుబడిగా ప్రకటన చేసి వచ్చేసినట్లు మరో పారిశ్రామిక ప్రతినిధి చెప్పారు. దీన్నిబట్టి రాష్ట్రంలో పరిస్థితి ఎలా  ఉందో అర్ధంచేసుకోవచ్చు. ఇంకోపక్క ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తులను ప్రభుత్వ శాఖలు కూడా కొనుగోలు చేయకపోవడం, ప్రభుత్వ అసమర్థ విధానాలతో ప్రజల్లో కొనుగోలు శక్తిపడిపోవడంతో ఈ ప్రభావం ఎంఎస్‌ఎంఈ యూనిట్లపై ప్రత్యక్షంగా పడుతోంది. 

కోవిడ్‌ వంటి సంక్షోభం వచ్చినా ఏ ఒక్క పరిశ్రమ మూతపడకూడదన్న ఉద్దేశంతో గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రీస్టార్ట్‌ ప్యాకేజీతో ఆదుకుంది. కానీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం మా ప్రోత్సాహకాలు మాకివ్వండని అడిగితే బ్యాంకు నుంచి రూ.5 వేల కోట్ల అప్పు తీసుకుంటున్నాం.. రాగానే ఇస్తామని చెప్పి ఆరునెలలు దాటినా చిల్లిగవ్వ ఇవ్వలేదని పారిశ్రామికవేత్తలు మండిపడుతున్నారు. 

సకాలంలో ప్రోత్సాహకాలు విడుదల చేయాలి.. 
రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలు అనేక గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం, అధిక విద్యుత్‌ ఛార్జీలు, ప్రభుత్వ శాఖల కొనుగోళ్లు లేకపోవడం, టెక్నాలజీ అప్‌గ్రెడేషన్‌ లేకపోవడం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలను ఆదుకోవడానికి తమిళనాడు తరహా విధానం అమలుచేయాలంటూ ఇప్పటికే ప్రభుత్తానికి ఒక నివేదిక ఇచ్చాం. సకాలంలో ప్రోత్సాహకాలు విడుదలచేసి మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది.  – వి. మురళీకృష్ణ, ప్రెసిడెంట్, ఫ్యాఫ్సియా 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)