Breaking News

ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

Published on Wed, 02/12/2025 - 11:31

కొవ్వూరు: వాడపల్లి గ్రామానికి చెందిన చిట్రా సూర్య (20) అనే యువకుడు మంగళవారం ఇంట్లో ఉరి వేసుకుని బలవర్మణానికి పాల్పడ్డాడు. రాజమహేంద్రవరం ఎస్‌కేవీటీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సూర్యకు అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ నెల 9వ తేదీన యువకుడు యువతి చదువుతున్న కొవ్వూరులోని స్కూలుకి వెళ్లాడు. యువతిని పిలువమని అడుగగా ప్రిన్సిపాల్‌ ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేశారు. తాము ఎవరినీ పంపలేదని చెప్పడంతో యువతిని కలిసేందుకు పాఠశాల నిర్వాహకులు నిరాకరించారు. యువతి పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. 

ఈ వ్యవహారంపై యువతి కుటుంబ సభ్యులు ఆ యువకుడి ఇంటికి వెళ్లి నిలదీశారు. స్థానిక బ్యాంకులో యువకుడి సోదరుడు పనిచేస్తున్నారు. ఆ యువకుడి బ్యాంకు ఉద్యోగం తీయించి వేస్తామని యువతి తల్లిదండ్రులు హెచ్చరించారు. పైగా సూర్యని చంపుతామని బెదిరించడంతో మనస్థాపం చెంది సోమవారం అర్ధరాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో పక్క గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు యువకుడి తండ్రి శివ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

 ఈ మేరకు యువతి కుటుంబ సభ్యులైన హరి, వరలక్ష్మీ , పార్వతీ, లాయర్‌ నరసింహరాజు, సూర్యచంద్రం, సత్యవతిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కె.జగన్‌మోహన్‌రావు తెలిపారు. సూర్య ఆ కుటుంబంలో రెండో సంతానం అన్నారు. ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారని అన్నారు. మృతుడి తండ్రి తాపీ పనిచేస్తాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు ఆయన తెలిపారు.  

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)