Breaking News

సీఎం వైఎస్‌ జగన్‌ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు

Published on Tue, 04/30/2024 - 04:40

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందించిన చేయూతతో రాష్ట్రంలో మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. రాష్ట్రంలో­ని యువతకు ఉపాధి కల్పించేందుకు జగన్‌ ప్రభు­త్వం ఎంఎస్‌ఎంఈలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి పలు ప్రోత్సాహకాలు అందిస్తోంది. వీటిని సది్వనియోగం చేసుకుంటూ మహిళలు సొంతంగా ఎంఎస్‌ఎంఈలను ఏర్పాటు చేసి, మరికొందరికి ఉపాధి చూపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 

రాష్ట్రంలో గత నాలుగేళ్ల­లో అంటే.. 2022 జూలై నుంచి 2024 జనవరి వరకు రాష్ట్రంలో మహిళలు సొంతంగా 2,17,359 ఎంఎస్‌ఎంఈలను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నట్లు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖే  వెల్లడించింది. ఈ మహిళా ఎంఎస్‌ఎంఈల ద్వారా 1,8,03,672 మంది యువతకు ఉద్యోగాలు లభించాయని తెలిపింది. ఈ మహిళా ఎంఎస్‌ఎంఈల ఏర్పాటుకు రూ.7,229.41 కోట్లు పెట్టుబడిగా పెట్టారని, వీటి టర్నోవర్‌ రూ.73,435.96 కోట్లుగా ఉందని వెల్లడించింది.

 ఇవన్నీ అధికారికంగా ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ వద్ద నమోదైన ఎంఎస్‌ఎంఈలు కాగా, ఇప్పటికీ నమోదు కాని ఎంఎస్‌ఎంఈలు రాష్రంలో 2023 జనవరి 11 నుంచి 2024 జనవరి 31 వరకు ఒక్క ఏడాదిలోనే మరో 4,73,932 మహిళా ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటు చేశారని, వీటి ద్వారా 6,,22,389 మందికి ఉద్యోగావకాశాలు లభించాయని పేర్కొంది. మహిళా యాజమాన్యంలోని ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది.

 ఈ ఎంఎస్‌ఎంఈలకు ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ పోగ్రామ్‌ (పీఎంఈజీపీ) కింద  క్రెడిట్‌ గ్యారెంటీ నిధి నుంచి ఆరి్ధక సాయం అందిస్తున్నట్లు తెలిపింది. మహిళల్లో వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి నైపుణ్యాలను అమలు చేస్తోందని పేర్కొంది. ప్రత్యేకంగా మహిళల ఎంఎస్‌ఎంఈలను ఉద్యమం పోర్టలో రిజి్రస్టేషన్‌కు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి, వారికి అవరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు పేర్కొంది.

పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్‌ చేయూత 
రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కూడా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను పలు విధాలుగా ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా మహిళలు స్థాపించే ఎంఎస్‌ఎంఈలకు మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తోంది. దీంతో రాష్ట్రంలో మహిళలు పెద్ద ఎత్తున సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలతో పాటు పరిశ్రమలకు రాయితీలు ఇవ్వకుండా పెద్ద ఎత్తున బకాయిలు పెట్టింది. దీంతో ఎంఎస్‌ఎంఈలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గత ప్రభుత్వ బకాయిలను కూడా చెల్లించడంతో పాటు ఎంఎస్‌ఎంఈలకు రూ.2,087 కోట్లు  రాయితీలుగా చెల్లించారు. ముఖ్యంగా కోవిడ్‌ సమయంలో ఎంఎస్‌ఎంఈలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. దీంతో ఆ పరిశ్రమలన్నీ కోవిడ్‌ సంక్షోభం నుంచి కోలుకొని, నిలదొక్కుకోవడమే కాకుండా, రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)