Breaking News

ఏజెన్సీలో ఎదురుకాల్పులు

Published on Wed, 04/30/2025 - 05:30

సాక్షి, పాడేరు: అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు, వై.రామవరం, జీకే వీధి మండలాల సరిహద్దు  పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులతో మార్మోగింది. సోమవారం ఉదయం, మధ్యాహ్న సమయంలో అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. 15 మంది మావోయిస్టులు  త్రుటిలో తప్పించుకున్నారు. దీంతో అదనపు పోలీసు బలగాలు రంగంలోకి దిగి అటవీప్రాంతాన్ని జల్లెడ పడుతున్నట్టు తెలుస్తోంది.  

కొద్ది రోజులుగా కూంబింగ్‌  
మావోయిస్టుల సంచారంపై  సమాచారం అందుకున్న పోలీసు యంత్రాంగం ఎస్పీ అమిత్‌బర్ధర్‌ ఆదేశాలతో కొద్ది రోజుల నుంచి విస్తృతంగా కూంబింగ్‌ చేపట్టింది. సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో కాకులమామిడి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో 15 మంది మావోయిస్టులు పోలీసులకు ఎదురుపడి కాల్పులు జరిపారు. ఆత్మరక్షణలో భాగంగా పోలీసు బలగాలూ మావోయిస్టులపై కాల్పులు జరిపాయి. మావోయిస్టులు సామగ్రి వదిలి తప్పించుకున్నారు. 

గాలింపు చర్యలను పోలీసులు కొనసాగిస్తున్న నేపథ్యంలో మళ్లీ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కాంటవరం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. అక్కడా మావోయిస్టులు వదిలిపెట్టిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల్లో కీలకనేతలు గాజర్ల రవి, జగన్‌లు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కిట్‌ బ్యాగులలో కీలక సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది. కొందరు మావోయిస్టులకు గాయాలయ్యాయనే అనుమానంతో పోలీసులు కూంబింగ్‌ను విస్తతం చేశారు.   

8 రకాల సామగ్రి స్వాదీనం 
రెండు ఎదురు కాల్పుల సందర్భంగా మావోయిస్టులకు చెందిన 8 రకాల సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అమిత్‌బర్ధర్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్‌ఎల్‌ఆర్‌ మ్యాగజైన్, అమ్యూనిషన్, ఆధునిక కమ్యూనికేషన్‌ పరికరాలు, కిండల్‌ ట్యాబ్, మావోయిస్టు సాహిత్యం, దుస్తులు, ఔషధాలు, సిరింజీలు, కిట్‌బ్యాగులు, టార్పాలిన్, వండిన భోజనం, ఇతర లాజిస్టిక్స్‌ను మావోయిస్టులు వదిలిపెట్టి పారిపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మావోయిస్టుల జాడపై సమాచారం ఉంటే ప్రజలు తమకు తెలియజేయాలని కోరారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)