అద్దె ఇల్లు.. ఆరుబయటనే శవం

Published on Tue, 09/10/2024 - 08:38

ఇబ్రహీంపట్నం: మూఢనమ్మకాలు ఇప్పటికీ ప్రజల మెదళ్లను శాసిస్తూనే ఉన్నాయి. నిన్నమొన్నటి వరకూ ఆ ఇంటి పరిసరాల్లోనే ఆడుకుంటూ ఉన్న ఆ బాలుడు.. మాయదారి వరద కారణంగా విషజ్వరానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ కుటుంబం అద్దెకుంటున్న ఇంటి యజమాని ఆ బాలుడి మృతదేహాన్ని ఇంట్లోకి రానీయకుండా అడ్డుకున్నాడు. దీంతో బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులు చేసేది లేక జాతీయ రహదారి పక్కనే ఓ టెంటు వేసి ఆ బాలుడి మృతదేహాన్ని ఉంచాల్సి వచ్చింది. ఈ హృదయ విదారక ఘటన ఇబ్రహీంపట్నం మండలంలోని ప్రసాద్‌నగర్‌లో సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. 

విషజ్వరంతో.. 
కూలి చేసుకునే పాలపర్తి రాజేష్‌, రూతు దంపతులకు ఇద్దరు కుమారులు. జెడ్పీ పాఠశాలలో పెద్ద కుమారుడు ఏడో తరగతి, చిన్న కుమారుడు జాన్‌   వెస్లీ(12) ఆరో తరగతి చదువుతున్నాడు. ఇటీవల కాలంలో ప్రసాద్‌నగర్‌ వరద ముంపునకు గురికావడంతో పారిశుద్ధ్యలేమి, కలుషిత తాగునీరు, అందుబాటులో లేని వైద్య సదుపాయం వల్ల కొద్ది రోజుల క్రితం బాలుడు జాన్‌వెస్లీ జ్వరం బారిన పడ్డాడు. స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడితో వైద్యం చేయించారు. మరలా కడుపులో నొప్పి రావడంతో రెండురోజుల క్రితం మరో ప్రైవేట్‌ వైద్యశాలకు తీసుకెళ్లారు. వారు మెడికల్‌ టెస్ట్‌లు రాయగా.. తల్లిదండ్రుల వద్ద డబ్బులు లేక చేయించలేదు. దీంతో కడుపులో నొప్పి భరించలేక బాలుడు మృత్యువాత పడ్డాడని తల్లిదంద్రులు చెబుతున్నారు. 

మంటగలసిన మానవత్వం.. 
వారు ఉంటున్నది అద్దె ఇల్లు కావడంతో ఆ యజమాని బాలుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకురావద్దని చెప్పారు. దీంతో 65వ నంబర్‌ జాతీయ రహదారి పక్కనే టెంట్‌వేసి బంధువుల కడసారి చూపుకోసం ఉంచారు. ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌ బాలుడి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అరి్పంచారు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)