Breaking News

ప్రాజెక్టులకు నిధుల పరవళ్లు 

Published on Fri, 03/17/2023 - 04:29

సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టులకు 2023–24 వార్షిక బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు రూ.11,908.10 కోట్లను కేటాయించింది. సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించిన సీఎం వైఎస్‌ జగన్‌ గతేడాది పెన్నా డెల్టా జీవనాడులైన నెల్లూరు, సంగం బ్యారేజీలను పూర్తి చేసి సెపె్టంబరు 6న జాతికి అంకితం చేయడం తెలిసిందే. తద్వారా పెన్నా డెల్టాలో 4.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమర్థంగా నీళ్లందేలా జలయజ్ఞం ఫలాలను రైతులకు అందించారు. ఈ ఏడాదీ ప్రాధాన్యతగా గుర్తించిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు వీలుగా నిధులు కేటాయించారు.

ఉత్తరాంధ్రలో కీలకమైన వంశధార స్టేజ్‌–2 ఫేజ్‌–2, వంశధార–నాగావళి అనుసంధానం పనులు పూర్తయ్యేలా తగినన్ని నిధులు కేటాయించారు. వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ,  గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు సొరంగం పనుల పూర్తికి నిధులు కేటాయించారు. హంద్రీనీవా నుంచి కృష్ణా జలాలను మళ్లించి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో 68 చెరువులను నింపి సాగు, తాగునీటిని అందించే పథకాన్ని పూర్తి చేయడానికి అవసరమైన నిధులను కేటాయించారు. 


పోలవరంపై ప్రత్యేక దృష్టి.. 
పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తోం­ది. కేంద్రం రూ.3 వేల కోట్లకుపైగా రీయింబర్స్‌ చేయడంలో జాప్యం చేస్తున్నా రాష్ట్రమే నిధులను వెచ్చిస్తోంది. ఈ బడ్జెట్‌­లోనూ పోలవరంకు సింహభాగం నిధులు రూ.5,042.47 కోట్లు కేటాయించింది.

చంద్రబాబు నిర్వా­కా­లతో దెబ్బతిన్న డయా­­ఫ్రమ్‌ వాల్, ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో కోతతో ఏర్పడిన అగాధాల పూడ్చివేత పద్ధతులపై డ్యామ్‌ డిజై­న్‌ రివ్యూ ప్యానల్‌ సూచనల మేరకు దృష్టి పెట్టాం. తర్వాత వరదల్లోనూ ప్రధాన డ్యామ్‌ పనులు చేపట్టి సత్వరమే పూర్తి చేసేలా అడుగులు వేస్తోంది.  

జలయజ్ఞం ఫలాలే లక్ష్యంగా.. 
సాగునీటి ప్రాజెక్టుల పనులపై ఖర్చు పెట్టే ప్రతి పైసా రైతుల జీవనోపాధులను పెంచడానికి దోహదం చేసేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. తోటపల్లి, పుష్కర, తాటిపూడి, తెలుగుగంగ, శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్సార్బీసీ), గుండ్లకమ్మ తదితర ప్రాజెక్టుల కింద మిగిలిపోయిన ఆయకట్టుకు నీళ్లందించే ఉప కాలువలు, పిల్ల కాలువలను పూర్తి చేయడానికి బడ్జెట్‌లో నిధుల కేటాయింపు చేశాం.

ఉత్తరాంధ్రలో కీలకమైన తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి వీలుగా నిధులు కేటాయించింది. కర్ణాటక పరిధిలో తుంగభద్ర ఎగువ, దిగువ కాలువల ఆధునికీకరణ పూర్తి చేసి రాష్ట్ర కోటా నీటిని పూర్తి స్థాయిలో రాబట్టి రాయలసీమ రైతులకు నీళ్లందించడమే లక్ష్యంగా తుంగభద్ర బోర్డుకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చింది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)