Breaking News

పదో తరగతి పరీక్ష ఫీజుల షెడ్యూల్‌ విడుదల

Published on Tue, 11/11/2025 - 03:33

సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల (ఎస్‌ఎస్‌సీ–2026) ఫీజు చెల్లింపునకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ విడుదల చేసింది. అన్ని పాఠశాలలు రెగ్యులర్, ఒకసారి ఫెయిల్‌ అయిన విద్యార్థుల పరీక్ష ఫీజును ఈనెల 13 నుంచి వచ్చేనెల 15వ తేదీ వరకు చెల్లించవచ్చని పరీక్షల డైరెక్టర్‌ కేవీ శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. రూ.50 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 3 వరకు, రూ.200 ఫైన్‌తో 10వ తేదీ, రూ.500 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 15వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఈ తేదీలలో ఏవైనా ప్రభుత్వ సెలవు దినాలు ఉంటే తదుపరి పని దినాన్ని గడువు తేదీగా పరిగణిస్తారు. విద్యార్థుల ఫీజును  https://bse. ap.gov.in లలో అందుబాటులో ఉన్న స్కూల్‌ లాగిన్‌ ద్వారా మాత్రమే చెల్లించాలని పేర్కొ­న్నారు. మాన్యువల్‌ నామినల్‌ రోల్స్‌ సమర్పించాల్సిన అవసరం లేదన్నారు.

పరీక్ష ఫీజు రుసుం ఇలా.. 
⇒ రెగ్యులర్‌ విద్యార్థులు (అన్ని సబ్జెక్టులకు) రూ.125
⇒ మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125
⇒ మూడు సబ్జెక్టుల వరకు రూ.110
⇒ వృత్తి విద్యా కోర్సులకు అదనంగా రూ.60
⇒ వయసు మినహాయింపు కోసం రూ.300

మార్చిలో ‘పది’ పరీక్షలు
పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మా­ర్చిలో నిర్వహించేందుకు అధికారు­లు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మార్చి నెల రెండు లేదా మూడో వారం నుంచి ప్రారంభించాలని యో­చిస్తు­న్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. మార్చి 16, 21 తేదీలతో టైంటేబుల్‌ను సిద్ధం చేసినట్టు తెలిసింది. 

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)