యువతిపై పది మంది యువకుల లైంగికదాడి

Published on Thu, 08/14/2025 - 11:00

జనగామ రూరల్‌: ఓ యువతిపై సామూహిక    లైంగికదాడికి ప్పాలడిన పది మంది నిందితులను బుధవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ పండేరి చేతన్‌ నితిన్‌ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జనగామ పట్టణానికి చెందిన ఓ యువతిపై పది మంది యువకులు మహమ్మద్‌ ఒవైసీ, ముత్యల పవన్‌ కుమార్, బౌద్ధుల శివ కుమార్, నూకల రవి, జెట్టి సంజయ్, ఎం.డి అబ్దుల్‌ ఖయ్యూం, పుస్తకాల సాయి తేజ, ముత్తాడి సుమంత్‌ రెడ్డి, గుండ సాయి చరణ్‌ రెడ్డి, ఓరుగంటి సాయిరాం లైంగికదాడికి పాల్పడ్డారు. 

 జూన్‌లో బాధితురాలిని సదరు యువకులు ప్రేమ, స్నేహం పేరుతో కారులో తీసుకుని జనగామ–సూర్యాపేట రోడ్‌లో గల ‘టీ వరల్డ్‌’ వెనుక ఉన్న ఒక రూమ్‌లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. అందులో ఓ యువకుడు ప్రేమిస్తున్నానని బాధితురాలికి మాయమాటలు చెప్పి గోవాకు తీసుకెళ్లి అక్కడ కూడా పలుమార్లు శారీరకంగా కలిశాడు. ఈ ఘటనపై బాధితురాలి చిన్నమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం నిందితులు సిద్దిపేట రోడ్డులో ఉన్నారనే సమాచారం మేరకు సీఐ దామోదర్‌రెడ్డి, ఎస్సై భరత్‌ అక్కడకు చేరుకుని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు. 

దీంతో అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీస్‌ స్టేషన్లకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా ఏఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యువత మత్తు పదార్థాలు సేవించినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అత్యవసర సమయాల్లో డయల్‌ 100కు  కాల్‌ చేయాలని సూచించారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)