Breaking News

'అమ్మ డెయిరీ'ని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Published on Wed, 06/14/2023 - 12:38

అనంతపురం:ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పరిపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అనంతపురం ఆలమూరులో అమ్మ డెయిరీని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. రూ.20 కోట్లతో అమ్మ డైరీని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఆయన అభినందించారు.

సీఎం జగన్ పాదయాత్రలో పేర్కొన్న విధంగానే డెయిరీలకు ప్రోత్సాహకాలిచ్చారని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. సీఎం జగన్ 99 శాతం హామీలను అమలు చేశారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ వరాలు ప్రకటించారని అన్నారు. పది వేలకు పైగా ఉద్యోగులను రెగ్యులర్ చేయడం చారిత్రాత్మకమని కొనియాడారు.

సీఎం జగన్ కృషి ఫలితమే..
మహిళల స్వయం ఉపాధి కోసమే అమ్మ డైరీ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చెప్పారు. పదివేల మంది మహిళలకు పాల వ్యాపారం ద్వారా లాభాలు పంచుతామని పేర్కొన్నారు. ఏపీకి అమూల్ సంస్థ రావటం వల్లే మిగిలిన కంపెనీలు పాడి రైతులకు గిట్టుబాటు ధరలు అందిస్తున్నాయని చెప్పారు. ఇదంతా సీఎం జగన్ కృషి ఫలితమే అని వివరించారు. లక్ష లీటర్లతో ప్రారంభించిన అమ్మడైరీని పది లక్షల లీటర్ల స్థాయికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు.
 

ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాల విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే..

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)